Ayodhya: నయనానందకరం నీ దర్శనం.. అయోధ్య గర్భగుడిలో ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహం ఇదే !..

|

Dec 30, 2023 | 7:50 AM

గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు రెడీ చేసిన మూడు విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తల మండలి పరిశీలించి .. మౌఖిక ఓటింగ్‌ ద్వారా విగ్రహాన్ని ఎంపిక ద్వారా ఒక విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా ట్రస్టుకు అందజేసింది. అయితే విగ్రహం ఎంపికపై ట్రస్టు తమ తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత అధికారికంగా విగ్రహాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

Ayodhya: నయనానందకరం నీ దర్శనం.. అయోధ్య గర్భగుడిలో ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహం ఇదే !..
Ayodhya Ram Lallaa
Follow us on

దేశ విదేశాల్లో ఉన్న హిందువులు ఎదురుచూస్తున్న శుభతరుణం వచ్చేస్తోంది. శ్రీ రాముడు జన్మించిన అయోధ్యానగరిలో సరయు నది తీరంలో రామ మందిరంలో బాల రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నం కానుంది. కొత్త ఏడాదిలో రామమందిరం రామయ్య భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ శుభఘడియల కోసం దాదాపు 500 ఏళ్లగా యావత్ దేశం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణం ప్రారంభం నుంచి ఆలయ రూపురేఖలతో పాటు.. పూజలను అందుకోనున్న రాములోరి విగ్రహంపై కూడా ఆసక్తి నెలకొంది. అంతేకాదు గర్భగుడిలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలను తయారు చేస్తున్నారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

విగ్రహాలను పరిశీలించిన 11 మంది సభ్యులు

మూడు విగ్రహాలను పరిశీలించిన ట్రస్ట్ ట్రస్టీల బోర్డులోని 11 మంది సభ్యుల్లో రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా ఉన్నారు. అందరూ ముగ్గురు శిల్పులతో దాదాపు అరగంట గడిపారు. విగ్రహానికి సంబదిందించిన అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని అందజేశారు. ట్రస్ట్ ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ తుది నిర్ణయం తీసుకుంటారు’ అని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. మూడు విగ్రహాలు అందంగా ఉన్నాయి. ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది” అని గిరి పేర్కొన్నారు.

  1. మూడు విగ్రహాలలో ఒకటి రామాలయం గర్భగుడిలో ప్రతిష్ఠించబడుతుంది. మిగిలిన రెండింటిని ఆలయంలోని మొదటి, రెండవ అంతస్తులలో ఉంచుతారు.
  2. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పులు గణేష్ భట్ , అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ్ పాండేలు రామ్ లల్లా మూడు విగ్రహాలను చెక్కారు.
  3. ఇవి కూడా చదవండి
  4. కర్ణాటకకు చెందిన శిల్పులు నల్ల రాతిని ఉపయోగించగా, రాజస్థాన్‌కు చెందిన శిల్పి తెల్లని మక్రానా పాలరాయిని ఉపయోగించారు.
  5. ముంబైకి చెందిన ప్రముఖ కళాకారుడు వాసుదేవ్ కామత్ ట్రస్ట్‌కు సమర్పించిన స్కెచ్ ఆధారంగా రామ్ లల్లా విగ్రహాలు రూపొందించబడ్డాయి.
  6.  51 అంగుళాల ఎత్తుతో ఐదేళ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంటుంది.
  7. “ట్రస్ట్ విగ్రహాన్ని ఎంపిక చేసి త్వరలో అధికారిక ప్రకటన  చేయనుంది. ఇలా గర్భగుడిలో ప్రతిష్టాపన కోసం  ఎంపిక చేసిన బాల రామయ్య విగ్రహాన్ని జనవరి 17వ తేదీన శోభా యాత్రలో ఊరేగింపుగా తీసుకు వస్తారు.
  8. రామ్ లల్లా విగ్రహంపై ట్రస్ట్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికంగా నల్లరాళ్లతో మలచబడిన రామ్ లల్లా రెండు విగ్రహాలు ట్రస్ట్‌లో ఎక్కువ మందికి నచ్చినట్లు దైవత్వంతో ఉట్టిపడుతున్నట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండింటి నుంచి రామ్ లల్లా విగ్రహాన్ని ఎంపిక చేస్తారు’ అని ట్రస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి 16న రామ మందిర ప్రారంభోత్సవ ఆచార వ్యవహారాలు ప్రారంభమవుతాయి. జనవరి 20న సరయూ నదీజలాలతో రామ మందిరాన్ని శుద్ధి  చేయనున్నారు. నవగ్రహ పూజలతో పాటు వాస్తు పూజలు నిర్వహించనున్నారు. జనవరి 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉండనుంది. జనవరి 22న జరగనున్న రామ్‌లల్లా పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆచారాన్ని నిర్వహించనున్నారు. పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..