Ayodhya Temple: రామయ్య ఆలయ సముదాయంలో కొలువుదీరనున్న శివయ్య.. నర్మద నది నుంచి తీసిన శిలతో తయారీ..

|

Jul 31, 2023 | 11:34 AM

అయోధ్యలోని రామ మందిర సముదాయంలో పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారపు గోడను కూడా నిర్మిస్తున్నారు. ఈ ఉద్యానవనంలో ఆరు వేర్వేరు ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఒకటి శివాలయం ఉంటుంది. నర్మదానది నుండి తీసిన నర్మదేశ్వర శివలింగం ఈ శివాలయంలో ప్రతిష్టించబడుతుంది. ఈ శివలింగాన్ని అయోధ్యకు తరలించేందుకు ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. అయోధ్యలోని రామ మందిర సముదాయంలో పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారపు గోడను కూడా నిర్మిస్తున్నారు. ఈ ఉద్యానవనంలో ఆరు వేర్వేరు ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి.

Ayodhya Temple: రామయ్య ఆలయ సముదాయంలో కొలువుదీరనున్న శివయ్య.. నర్మద నది నుంచి తీసిన శిలతో తయారీ..
Ayodhya Temple
Follow us on

రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామయ్య ఆలయ నిర్మాణం కోసం పలువురు దేశంలోని మూలమూల నుంచి వివిధ రకాలుగా విరాళాలు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది తీరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం  ఖాండ్వా ఓంకారేశ్వర్‌ ఆలయ సిబ్బంది కూడా రామమందిరానికి తమ విరాళాన్ని అందజేస్తుంది. నర్మదా నది నుండి తీసిన భారీ రాతిని నాలుగున్నర అడుగుల ఎత్తైన శివలింగంగా మలిచారు. నర్మదేశ్వర శివలింగాన్ని రాంలాలా ఆలయ సముదాయంలోని శివాలయంలో ప్రతిష్టించబనున్నారు.

ఈ శివలింగాన్ని అయోధ్యకు తరలించేందుకు ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. శివయ్యను శోభాయాత్రగా తీసుకుని వెళ్తారు. శివలింగం ఆగస్టు 23న అయోధ్యకు చేరుకుంటుంది. సమాచారం ప్రకారం, నర్మదేశ్వర శివలింగ యాత్రలో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు నర్మదేశ్వర శివలింగాన్ని అందజేయనున్నారు.

అయోధ్యలోని రామ మందిర సముదాయంలో పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారపు గోడను కూడా నిర్మిస్తున్నారు. ఈ ఉద్యానవనంలో ఆరు వేర్వేరు ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఒకటి శివాలయం ఉంటుంది. నర్మదానది నుండి తీసిన నర్మదేశ్వర శివలింగం ఈ శివాలయంలో ప్రతిష్టించబడుతుంది.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వేసిన కమిటీ రామమందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది. కమిటీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ జూలై 17, 2023న నర్మదేశ్వర శివలింగాన్ని ఇవ్వాల్సిందిగా ఓంకారేశ్వర  నాజర్ నిహాల్ ఆశ్రమ నిర్వాహకుడు సంత్ శ్రీ శ్రీ 1008 శ్రీ నర్మదానంద బాప్జీ మహారాజ్‌కు లేఖ రాశారు. దీంతో ఆలయ నిర్వాహకులు నర్మదా నది నుండి తీసిన శిలను శివలింగంగా మలిచారు.

చంపత్ రాయ్ డిమాండ్ మేరకు నర్మదా నది నుండి ఒక భారీ శిలను తీసి ప్రత్యేకంగా నాలుగున్నర అడుగుల ఎత్తైన శివలింగాన్ని తయారు చేశారు. అయితే నర్మదా నది నుంచి రాయిని తీసి శివలింగాన్ని తయారు చేయడం కోసం ఇంత క్రితం చాలామంది ప్రయత్నించారని.. అయితే అవన్నీ విఫలమయ్యాయని  స్వామి  నర్మదానంద్ చెప్పారు.

ఇప్పుడు అయోధ్య లో శివయ్యను ప్రతిష్టించాలానే డిమాండ్ మేరకు.. ఇప్పుడు నర్మద నది నుంచి  భారీ శిలను తీసినట్లు ఆయన చెప్పారు. భోళాశంకరుడు స్వయంగా అయోధ్యకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నట్లు. నర్మదా నది లోతుల నుండి తీసిన ఈ భారీ రాతిని నర్మదేశ్వర శివలింగంగా మలిచారు.

ఆగస్టు 18న శివలింగం యాత్ర ప్రారంభం
ఓంకారేశ్వర్‌లో ఉన్న శ్రీ శ్రీ 1008 శ్రీ శ్రీ నర్మదానంద్ బాప్జీ మహారాజ్ శ్రీ శ్రీ నాజర్ నిహాల్ ఆశ్రమం నుంచి  ఆగస్టు 18న నర్మదేశ్వర శివలింగం అయోధ్యకు బయలుదేరుతుంది. ఈ శివలింగాన్ని శ్రీరామ జన్మభూమి ఆలయం సముదాయంలో ప్రతిష్టించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..