కాకి తలపైన తన్నితే చాలామంది అపశకునంగా భావిస్తారు. ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు. అయితే కాకి మన దగ్గరగా వచ్చినా, మన పక్కన కూర్చున్న, భుజంపై తాకినా ఇలా ప్రతి ఒక దానికి ఓ నిగూడ అర్థం దాగుందని పెద్దలు చెబుతున్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు సంకేంతంగా సూచిస్తున్నారు. అయితే కొంతమంది వీటిని నమ్ముతారు.. మరికొంత మంది పట్టించుకోరు. ఏదిఏమైనా కాకికి సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అతిథి రాకకు సంకేతం
మీ ఇంటిపై కాకి వాలి శబ్దాలు చేసిందంటే అతిథులు ఇంటికి రాబోతున్నారని పెద్దలు చెబుతున్నారు.
2. సంతానం
పెళ్లి సందర్భంగా కాకి తన ముక్కుతో స్వీట్లను తీసుకొని ఎగిరిపోతే వివాహం చేసుకున్న జంటకు త్వరలోనే సంతానం కలుగుతుందని అంటారు. అంతేకాకుండా అందమైన పిల్లలు పుడతారని నమ్మకం.
3. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది
నీటితో నిండిన కుండపై కాకి వాలితే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని చెబుతారు. దీర్ఘకాలంలో మీకు డబ్బు రాబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ధాన్యం కొరత ఉండదు .
4. డబ్బుకు కొరత ఉండదు
ప్రతిరోజు మీరు కాకికి ఆహారం పెడితే నిత్యం మీ చేతిలో డబ్బు ఉంటుందని చెబుతారు.
ఆ ఇంటి ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని అర్థం.
5.అందమైన భార్య
ఎగిరిపోతున్న కాకి నోటి నుంచి తెలుపు,స్వీట్స్ లేదా పసుపు రంగు స్వీట్స్ జారి మీద పడితే అతడు త్వరలో ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకుంటాడని అర్థం. .
6. త్వరలో పనులు విజయవంతమవుతాయి
మీరు ఏదైనా పని కోసం బయటకు వెళ్లేటప్పుడు కాకి దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు లేదా పడమర నుంచి తూర్పుకు కదులుతూ తియ్యటి పండ్లను ముక్కుతో పట్టుకుంటే మీ పని త్వరగా అవుతుందని అర్థం.
7. ఈ విశ్వాసాలు కేవలం పెద్దలు చెప్పినవి మాత్రమే. వీటికి ఎటువంటి ఆధారాలు లేవని గుర్తించండి.