Astro Tips: దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు.. రాహు, కేతు దోషాల నివారణకు ఏ నూనెతో దీపాన్ని వెలిగించాలంటే..

|

Jun 26, 2023 | 8:39 AM

దీపాన్ని ఇంటిలో మాత్రమే కాదు ఆలయంలో కూడా వెలిగిస్తారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించే సంప్రదాయం శతాబ్దాల నాటిది. దీపం వెలిగించడం వల్ల వాతావరణంలో సానుకూలత వస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుందని, అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే నిత్య పూజలో దీపాలు వెలిగించే వారు కొన్ని తప్పులు చేస్తుంటారు. తద్వారా దీపారాధన చేసినప్పటికీ పూజా ఫలితం అందదు. 

Astro Tips: దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు.. రాహు, కేతు దోషాల నివారణకు ఏ నూనెతో దీపాన్ని వెలిగించాలంటే..
Light A Lamp
Follow us on

సనాతన హిందూ ధర్మం ప్రకారం పూజకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసే సమయంలో దీపాన్ని వెలిగిస్తారు. ధూప, దీప నైవేద్యం లేకుండా పూజ పూర్తి కాదు. దీపాన్ని ఇంటిలో మాత్రమే కాదు ఆలయంలో కూడా వెలిగిస్తారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించే సంప్రదాయం శతాబ్దాల నాటిది. దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి వాతావరణంలో సానుకూలత వస్తుంది. అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే నిత్య పూజలో దీపాలు వెలిగించే వారు కొన్ని తప్పులు చేస్తుంటారు. తద్వారా దీపారాధన చేసినప్పటికీ పూజా ఫలితం అందదు.

దీపం వెలిగించే సమయంలో నియమాలు

నెయ్యి లేదా నూనె దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  దైవం అనుగ్రహం కోసం చేసే  పూజలో కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె వంటి అనేక రకాల నూనె దీపాలను వెలిగిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దీపాన్ని ఏ సందర్భంలో ఏ రమైన దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అనేది కూడా ముఖ్యం. ఈ రోజు దీపం ప్రాముఖ్యత, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ దీపాన్ని వెలిగించాలి ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. పూజా సమయంలో నెయ్యి దీపాన్ని వెలిగితే మీ కూర్చున్న చోటకు ఎడమ వైపున అదే నూనె దీపం అయితే కుడి చేతి వైపు ఉంచండి. అలాగే దీపాన్ని దేవునికి  దూరంగా వెలిగించవద్దు. దీపం పూజ మధ్యలో ఆరిపోకుండా ఎప్పుడూ నూనె లేదా నెయ్యి వేస్తూ ఉండండి. పూజ మధ్యలో దీపం ఆరిపోవడం అశుభం.
  2. కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లయితే, నూనె దీపం వెలిగించండి.
  3. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
  4. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె లేదా నువ్వుల దీపం వెలిగించాలి. ఆవనూనె దీపం వెలిగిస్తే ఏలి నాటి బాధలు తొలగిపోతాయి.
  5. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి .. అతని ఆశీర్వాదం పొందడానికి మల్లెపూల నూనె దీపాన్ని వెలిగించండి.
  6. ఎవరి జాతకంలోనైనా రాహు-కేతు దోషం ఉన్నట్లయితే.. దీంతో అశుభ ఫలితాలు కలుగకుండా ఉండేందుకు ఆముదం దీపం వెలిగించడం శ్రేయస్కరం.
  7. ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలుండాలంటే.. సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై సదా ఉంటుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.