హిందూ ధర్మంలో ప్రతి వ్యక్తీ జీవితంలో రెండు భాగాలు ఉంటాయని.. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని అంటారు. ఏ వ్యక్తీ జీవితం అయినా సరే జీవిత భాగస్వామి అర్ధం చేసుకునే తత్వం, పరిస్తితిలకు అనుగుణంగా సర్దుకుని వెళ్ళే మనసు ఇలాంటి లక్షణలు ఉన్న జీవిత భాగస్వామి ఉంటె ఆ దంపతులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో గడుపుతారు. అందుకనే మన పెద్దలు తమ పిల్లలకు పెళ్లి చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని బంధాలు ఎంత ప్రయత్నించినా బలంగా ఉండవు. ఇంకా చెప్పాలంటే నిలబడవు .. అదే సమయంలో కొన్ని జంటలు ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట అన్న చందంగా ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. మరి కొందరు తాము ప్రేమించిన వారిని చాలా అపురూపంగా చూసుకుంటూ బెస్ట్ లవర్స్ అంటే వీరే అనిపిస్తారు.
అయితే సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సవాల్. దీనికి చక్కని పరిష్కారం జ్యోతిష్య శాస్త్రం చూపిస్తుంది. అందుకనే పెళ్ళికి ముందు యువతీయువకుల జాతకాలను చూపిస్తారు. జాతకాలు బాగున్నాయని అనుకుంటేనే పెళ్లిని నిశ్చయిస్తారు. ఇందులో ఎ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పని నమ్ముతారు. అయితే వేదం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులను ప్రేమించడం జీవితంలో ఒక వరం అట. వీరు తమ ప్రేమని నిలబెట్టుకోవడానికి ఎంతైనా కష్టపడతారని.. ఒక్కసారి ప్రేమిస్తే అస్సలు వదులుకోరని వీరి ప్రేమ బంధం చాలా బలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపధ్యంలో ఏ రాశుల వారు మంచి ప్రేమికులో ఈ రోజు తెలుసుకుందాం..
వృషభ రాశి: ఈ రాశికి అధినేత శుక్రుడు. శుక్రుడు అందానికి, ఆకర్షణకి ప్రతిరూపంగా భావిస్తారు. మీరు అందానికి ప్రతిరూపంగా ఉంటారు. అందుకే ఈ రాశికి చెందిన వ్యక్తులను ఇతర రాశుల వారు ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడతారు. వీరు మన్మధ యోగం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులను కనుక ఒకసారి ప్రేమిస్తే జీవితంలో మరిచిపోవడం అనేది చాలా కష్టం. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామిని తమ ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారట. అంతేకాదు పెళ్లి విషయంలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. అందుకనే ఈ రాశికి చెందిన వ్యక్తులను ఎటువంటి అనుమానం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు అని అంతరున్నారు జ్యోతిష్యులు. వీరితో జీవిత భాగస్వామి చాలా సంతోషంగా జీవిస్తుంది. తాము పెళ్లి చేసుకున్న వ్యక్తిని ప్రేమిస్తారు. నిజాయితీగా ఉంటారు.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమకు ప్రతిరూపంగా చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. తాము ఇష్టపడిన వారిని రక్షించడానికి ఎటువంటి పరిస్తితులు ఎదురైనా వెనుకడుగు వెయ్యరు. ఈ రాశి వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ జీవితం చివరకూ పొందుతారు. జీవిత భాగస్వామికి మంచి మద్దతునిస్తారు. అయితే వీరికి భావోద్వేగాలను ఎక్కువ.. కనుక మనసు నొప్పించక పొతే చాలా సంతోషంగా ఉంటారు. తము భాగస్వామిని సంతోషంగా ఉంచుతారు. ఒక్కసారి వీరి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి సంపాదించడం కష్టం. కనుక వీరితో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో తమ ప్రియమైన వారు కష్టాల్లో ఉంటె ఓడర్పునిస్తారు. అండగా నిలబడారు. మొత్తానికి వీరు ఉత్తమ జీవిత భాగస్వామి అని చెప్పవచ్చు
సింహ రాశి: ఈ రాశి అధిగ్రహం సూర్యుడు.. వీరికి సూర్యుడు లక్షణాలు ఉంటాయి. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. అదే సమయంలో ఎవరినైనా ప్రేమిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా విడిచి పెట్టరు. తాము ప్రేమించిన వారి తోడుని జీవితాంతం కోరుకుంటారు. అంతేకాదు వీరు తమ ప్రేమను వ్యక్తం చేయడంలో ఎటువంటి భయాందోళనలకు గురి కారు. ఏమాత్రం వెనకడుగు వేయరు. తమ మనసుకు నచ్చిన వారితో జీవితం చివరి వరకు కలిసి ఉంటారు. వీరి ప్రేమ సముద్రం అంత లోతైనది. వీరిని ఒప్పించడం అత్యంత కష్టం.. ఒకవేళ వీరు ఒకసారి ప్రేమిస్తే మాత్రం జీవితంలో వారిని మరచిపోరు.
తులారాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవిత భాగస్వామిని వెతుక్కునే విషయంలో కొంచెం కష్టపడతారు. అయితే వీరి జీవితంలో జీవిత భాగస్వామిగా ఎవరు అడుగు పెట్టినా అదృష్ట వంతులే.. జీవిత భాగస్వామి జీవితాంతం సుఖంగా ఉంటారు. ఎటువని వివాదాలు లేకుండా గొడవలు పడకుండా సామరస్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారితో ప్రేమ సాన్నిహిత్యం చాలా సౌకర్యవంతంగా ఉంటుది. అంతేకాదు వీరు ఏర్పరచునే సంబంధాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటారు. అలవంటే ఏర్పాటు చేసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు