Zodiac Signs: ఈ 4 రాశుల వారికి రాబోయే 20 రోజులు దుర్దినాలే.. ఇప్పుడే అలర్ట్ అవ్వండి..
Zodiac Signs: కుజుడు 27 జూన్ 2022న మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 10 వరకు కుజుడు ఈ రాశిలో ఉంటాడు. మేషరాశి నుండి రాహువుతో..
Zodiac Signs: కుజుడు 27 జూన్ 2022న మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 10 వరకు కుజుడు ఈ రాశిలో ఉంటాడు. మేషరాశి నుండి రాహువుతో కుజుడు కలయిక ఏర్పడుతోంది. కుజుడు, రాహువు కలయిక అంగారక యోగాన్ని సృష్టిస్తోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ పరిస్థితి చాలా అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఏ పని కూడా సవ్యంగా జరుగదు. అన్నీ కష్టాలే ఎదురవుతాయి. ఈ కాలంలో ఏయే రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1. వృషభం: కుజుడు వృషభ రాశిలోని 12వ పాదంలో ప్రవేశించాడు. దీని కారణంగా ఈ రాశి వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కాలంలో ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులు ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఉంటుంది.
2. కన్యారాశి: కుజుడు ఈ రాశిచక్రంలోని ఎనిమిదో పాదంలో సంచరిస్తున్నాడు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో ఖర్చులు భారీగా పెరగవచ్చు. వాదనలకు దూరంగా ఉండాలి. మాటలను అదుపులో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది.
3. తులారాశి: కుజుడు మీ రాశిచక్రంలోని ఏడవ పాదంలో సంచరించాడు. దీని వలన ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. భాగస్వామ్య పనిలో హెచ్చు తగ్గులు చూడవచ్చు. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
4. వృశ్చిక రాశి: కుజుడు వృశ్చిక రాశిలోని ఆరవ పాదంలో సంచరిస్తున్నాడు. దీని వలన మీరు అశుభ ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. రుణం తీసుకునే అవకాశం ఉండవచ్చు.
ఈ కథనంలో అందించిన సమాచారాన్ని టీవీ9 తెలుగు నిర్ధారించడం లేదు. మత గ్రంధాలు, ఆస్ట్రాలజీ ప్రకారం దీనిని ఇవ్వడం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..