Astro Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. నివారణ కోసం ఈ సింపుల్ టిప్స్ ని పాటించిచూడండి

|

Jul 31, 2022 | 7:06 AM

ఈ చర్యలను ప్రయత్నించడం ద్వారా.. ఇంట్లోని ప్రతికూల శక్తి ప్రభావం నివారిస్తుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.  ఈరోజు ఇంట్లో ఆర్ధిక సమస్యల నివారణకోసం తీసుకోవాల్సిన కొని చర్యలు గురించి తెలుసుకుందాం.. 

Astro Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా..  నివారణ కోసం ఈ సింపుల్ టిప్స్ ని పాటించిచూడండి
Astro Tips
Follow us on

Astro Tips: సంపాదిస్తున్నాం.. కానీ డబ్బు నిల్వ ఉండడం లేదు.. అని తరచుగా వింటూనే ఉన్నాం. ఎంత కష్టపడినా ఆర్ధికంగా స్థిరపడడంలేదు. ఏదొక సమస్య, రోగాలు వస్తూనే ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు కొనసాగుతూనే ఉంటే.. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాల వల్ల కావచ్చు. ధన లేమి, రోగాలు, గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి శాస్త్రాలలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ చర్యలను ప్రయత్నించడం ద్వారా.. ఇంట్లోని ప్రతికూల శక్తి ప్రభావం నివారిస్తుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.  ఈరోజు ఇంట్లో ఆర్ధిక సమస్యల నివారణకోసం తీసుకోవాల్సిన కొని చర్యలు గురించి తెలుసుకుందాం..

ఇలాంటి వినాయకుడి ఫోటోని పెట్టుకోండి: 
ఆదిపూజ్యుడు విగ్నేశ్వరుడు. పనిలో అడ్డంకులను తొలగించి శుభాలను ఇస్తాడని నమ్మకం. శుభ కార్యాలలో ముందుగా గణేశుడిని పూజిస్తారు. అంతే కాకుండా.. ఇంట్లో డబ్బు కొరతను తొలగించి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి నాట్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్నిఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

వేణువు, నెమలి ఈకలు: 
వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి వేణువు అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. హిందూమతంలో వేణువుకి విశిష్ట స్థానం ఉంది.    వేణువు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. పూజగదిలో వెదురు వేణువును ఉంచిన ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషలు ఉంటాయి. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల వ్యాపారం,  ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అంతేకాదు నెమలి ఈక ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఈ పరిహారంతో వ్యక్తికి ఆదాయం పెరుగుతుంది.  ఖర్చులు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవి, కుబేరుల విగ్రహం
లక్ష్మీదేవి అమ్మవారు సంపదకు దేవత. కుబేరుడు ఆదాయ దేవుడు. అందువల్ల, సంపద వృద్ధి చెందడానికి.. లక్ష్మి ఫోటోతో పాటు కుబేరుడి బొమ్మను ఎల్లప్పుడూ ఉంచాలి. అటువంటి పరిస్థితిలో ఆర్ధిక సమస్యను అధిగమించడానికి ఇంట్లో లక్ష్మీ దేవి , కుబేరుడి బొమ్మను ఏర్పాటు చేసుకోండి.

ఇంట్లో శంఖం: 

శంఖం సానుకూల శక్తి, ఉత్సాహం, విశ్వాసానికి కారకంగా పరిగణించబడుతుంది. శంఖం ఉన్న ఇళ్లలో వాస్తు దోషం ఉండదని వాస్తులో చెప్పబడింది. శంఖం మహావిష్ణువు, లక్ష్మిదేవికి ప్రీతికరమైనదని శాస్త్రాలలో చెప్పబడింది. ఇంట్లో శంఖం ఉంటే ఆర్ధిక సంబంధ ఇబ్బందులు తలెత్తవు.

కొబ్బరి కాయ:
కొబ్బరికాయ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. కొబ్బరి లక్ష్మీ దేవి రూపమని నమ్ముతారు. కొబ్బరికాయను ఇంట్లో ఉంచడం వల్ల ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)