Astro Tips: వేసవి లో వీటిని దానం చేయడి.. జీవితంలో సక్సెస్, సుఖ సంతోషాలు మీ సొంతం

|

Apr 17, 2022 | 9:46 PM

Astro Tips: సనాతన ధర్మంలో దాతృత్వానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని.  దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం. జీవితంలో సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది...

Astro Tips: వేసవి లో వీటిని దానం చేయడి.. జీవితంలో సక్సెస్, సుఖ సంతోషాలు మీ సొంతం
Astro Tips
Follow us on

Astro Tips: సనాతన ధర్మంలో దాతృత్వానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని.  దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం. జీవితంలో సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది. సనాతన ధర్మంలో, ఒక నిర్దిష్ట సందర్భంలో, పండుగ లేదా తేదీలో దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో  కొన్నిసార్లు ప్రజలు దానం చేయడానికి సరైన సమయం, అవకాశం కోసం వేచి చూస్తారు. అంతేకాదు జ్యోతిష్యశాస్త్రంలో (astrology) దాతృత్వం కోసం కొన్ని నియమాలు సూచించారు. వీటిని అనుసరించడం ద్వారా ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. జీవితంలోని అన్ని రకాల కష్టాలను తొలగించడానికి,  కోరికలు నెరవేర్చడానికి దాన ధర్మం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తున్నాం.  దానధర్మం గ్రహాలకు సంబంధించిన దోషాలను తొలగించడమే కాకుండా, పాపం నుండి విముక్తిని కూడా ఇస్తుందని నమ్మకం.

దాన ధర్మం వల్ల ఇహంలో సుఖం, పరలోకంలో మోక్షం కలుగుతుంది. తన సామర్థ్యానికి తగ్గట్టుగా దానం చేయాలి అని గ్రంధాలలో చెప్పబడింది. వేసవి కాలంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలాలు లభిస్తాయి.  అవి ఏమిటో చూద్దాం..

నీరు: 
దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వడం గొప్ప పుణ్యమని అంటారు. వేసవిలో, ప్రజలు తరచుగా దాహంతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, దాహార్తులకు నీరు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. అయితే  మీరు వేసవిలో నీటి చలువ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంటె.. ముందు రెండు కుండలు నింపి వాటిని పక్కన పెట్టండి. ఒక కుండను విష్ణుమూర్తికి, మరొకటి మీ పూర్వీకులకు అంకితం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి.

మామిడి
పండ్ల దానం గురించి కూడా శాస్త్రాలలో చెప్పబడింది. వేసవిలో మామిడి పండుని దానం చేయవచ్చు. మామిడిపండుకు సూర్యభగవానునికి ప్రత్యక్ష సంబంధం ఉందని, దానిని దానం చేయడం ద్వారా సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు. వారి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటె..మామిడి పండును దానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మామిడి పండును దానం చేయడం వల్ల కెరీర్‌లో విజయం చేకూరుతుందని నమ్మకం.

బెల్లం
పూజ సమయంలో బెల్లం వాడటం శుభప్రదం అని  పురాణా గ్రంధాలలో చెప్పబడింది. అదే సమయంలో దానం చేయడం జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని దానం చేయడం వల్ల వ్యక్తి జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుందని చెబుతారు. కెరీర్‌లో ఏర్పడే  సమస్యలు తొలగిపోయి. బాధిత వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రనిరూపణ లేదు. 

Also Read: Chanakya Niti: జీవితంలో ఆర్ధిక కష్టాలు రాకూడదంటే ఈ విషయాలను గుర్తుంచుకోమంటున్న చాణక్య