సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం

మకర సంక్రాంతి నాడు మీరు సూర్య భగవానుడిని శాంతింపజేసేందుకు, న్యాయ దేవుడైన శనిదేవుని ఆశీస్సులు పొందాలనుకుంటే.. ఈ మూడు వస్తువులను దానం చేయాలి. సంక్రాంతి రోజున ఈ వస్తువువులను దానం చేయడం వల్ల వంద రెట్లు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు ఏయే దానాలు చేయాలో తెలుసుకుందాం.

సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం
Shanidev

Updated on: Jan 11, 2026 | 2:35 PM

ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రశించడాన్ని సూచిస్తూ మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. సూర్య భగవానుడి కుమారుడైన శని దేవుడి రాశి చక్రం మకర రాశి. దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానాలు చేసి పలు వస్తువులు దానం చేసే సంప్రదాయం పూర్వకాలం నుంచీ కొనసాగుతోంది.

మకర సంక్రాంతి సూర్య భగవానుడితో ముడిపడిన పండగ కాబట్టి.. ఈ రోజున ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సూర్య భగవానుడిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయని, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నమ్ముతారు. మకర సంక్రాంతి నాడు మీరు సూర్య భగవానుడిని శాంతింపజేసేందుకు, న్యాయ దేవుడైన శనిదేవుని ఆశీస్సులు పొందాలనుకుంటే.. ఈ మూడు వస్తువులను దానం చేయాలి. సంక్రాంతి రోజున ఈ వస్తువువులను దానం చేయడం వల్ల వంద రెట్లు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు ఏయే దానాలు చేయాలో తెలుసుకుందాం.

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సంక్రాంతి వీటిని దానం చేయాలి

నల్ల నువ్వులు
మకర సంక్రాంతి రోజున స్నానం, ధ్యానం, పూజ, జపం, తపస్సు చేసిన అనంతరం నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మీ జాతకంలో శనిదేవుడు బలపడతాడు. శని దేవుని అనుగ్రహం, ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున దేవాలయంలో నల్ల నువ్వులను కూడా దానం చేయవచ్చు.

నెయ్యి
మకర సంక్రాంతినాడు పూజ తర్వాత నెయ్యిని దానం చేయండి. నెయ్యి కలిపిన కిచిడి తయారు చేసి పేదవారికి అందించండి. మినపప్పుతో కలిపిన కిచిడి తయారు చేసి కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జీవితానికి ఆనందం, శాంతి లభిస్తుంది. శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం.

నల్ల దుప్పట్లు
మకర సంక్రాంతి నాడు పూజలు, జపాలు, ధ్యానం చేసిన తర్వాత పేదలకు నల్ల దుప్పట్లను దానం చేయండి. అలా చేయడం వల్ల శని దేవుడి ఆశీస్సుల ద్వారా కెరీర్, వ్యాపారం ఆశించిన విజయం లభిస్తుందని నమ్ముతారు. బెల్లం దానం చేసినా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.