CM Jagan-Statue of Equality: సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు శ్రీరామానుజాచార్యులు కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి వారికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని అభిలాషించారు. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారని.. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు సీఎం జగన్.
సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి చేరుకున్న సీఎం జగన్.. చినజీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆధ్యాత్మిక వేత్త మైహోమ్స్ గ్రూప్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వర రావు జగన్‌కు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. అనంతరం సీఎం జగన్ సమతామూర్తిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామివారు మాట్లాడుతూ.. దేశంలో సమాజ సేవ.. మంచి జరగాలని చినజీయర్ స్వామి అన్నారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు. సమతా విశేషాలు ఇక్కడి నుంచి అందించేందుకు కృషి చేస్తామన్నారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం పోరాడి విజయం సాధించారని అన్నారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు. సమతా విశేషాలు ఇక్కడి నుంచి అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: Uniform Measurements: వివాదంగా మారిన మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల వ్యవహారం.. స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ..