AP CM Jagan Visit Muchintal: నేడు ముచ్చింతల్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. యాగశాలలో ఈ రోజు కార్యక్రమాలు ఏంటంటే..?

|

Feb 07, 2022 | 9:32 AM

AP CM Jagan Visit Muchintal: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో

AP CM Jagan Visit Muchintal: నేడు ముచ్చింతల్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. యాగశాలలో ఈ రోజు కార్యక్రమాలు ఏంటంటే..?
Muchintal
Follow us on

AP CM Jagan Visit Muchintal: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ముచ్చింతల్‌ సందర్శించనున్నారు. త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఆరో రోజు (సోమవారం) ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటగా దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం నిర్వహిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు. వీటితో పాటు ప్రముఖులచే ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శన ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలకు చిన్న జీయర్ స్వామి యాగశాల నుంచి ఋత్విక్కులతో కలిసి ర్యాలీగా సమతా మూర్తి ప్రాంగణంలో ఉన్న దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అలాగే ఈ నెల 8న కేంద్ర మంత్రి అమిత్‌షా, 9న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, 10న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌,11న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, 12న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సందర్శన ఉంటుంది.

ఇదిలా ఉంటే  ముచ్చింతల్‌లోని సమతామూర్తిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో జస్టిస్‌ పొనుగంటి నవీన్‌రావు, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘుపతి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌, ఆ పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, మాజీ డీజీపీ అరవింద్‌రావు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌రెడ్డి, ఐసీఎఫ్‌ఏఐ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జగన్నాథన్‌ పట్నాయక్‌ (సిక్కిం), జగద్గురు స్వామి రామచంద్రాచార్య మహారాజ్‌ (రాజస్థాన్‌) తదితరులు ఉన్నారు.

చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?

Green Tea Side Effects: పరగడుపున గ్రీన్‌ టీ తాగే అలవాటు ఉందా.. చాలా దుష్ప్రభావాలు..?

Jio, Airtel, Vi: జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు..