Tirumala Brahmotsavam 2021: రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ..

|

Oct 10, 2021 | 7:13 PM

Tirumala Salakatla Brahmotsavam 2021: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

Tirumala Brahmotsavam 2021: రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ..
Cm Jagan
Follow us on

Tirumala Salakatla Brahmotsavam 2021: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్.. సోమవారం నాడు అంటే రేపు తిరుమలకు వెళతారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్.. 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బర్డ్ హాస్పటిల్‌కు చేరుకుంటారు. అక్కడ చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్స ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అటునుంచి అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం నడకదారిలో శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలేశుడి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిథి గృహానికి చేరుకురి.. సోమవారం రాత్రి అక్కడే బస చేస్తారు.

మరుసటి రోజు ఉదయం అంటే 12వ తేదీన ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ చానళ్ళను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిధి గృహానికి చేరుకుని.. అటునుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనం అవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Also read:

MAA Elections Counting: తొలి ఫలితం.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన శివారెడ్డి, కౌశిక్ గెలుపు

Russian plane crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిన విమానం.. 16 మంది మృతి..

Pelli SandaD Pre Release Event: చిరు, వెంకీ స్పెషల్ అట్రాక్షన్.. గ్రాండ్‌గా ‘పెళ్లి సందడి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్