Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు అలెర్ట్.. రాత్రి వేళల్లో ఆలయం మూసివేత.. ఎందుకంటే

Shirdi Sai Baba Temple: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో

Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు అలెర్ట్.. రాత్రి వేళల్లో ఆలయం మూసివేత.. ఎందుకంటే
Shirdi Sai Baba Temple

Updated on: Dec 27, 2021 | 7:12 AM

Shirdi Sai Baba Temple: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమతత్తం చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని.. హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వేరియంట్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర సహా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు ఒమిక్రాన్‌ కట్టడికోసం నైట్ కర్ఫ్యూను ప్రకంటించాయి. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తూ.. కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

25వ తేది రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూని విధించింది. అంతేకాదు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని, కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. వివాహ వేడుకల్లో కేవలం 100 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతించింది. ఈ నేపథ్యంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కర్ఫ్యూ ఆదేశాల కారణంగా మహారాష్ట్రలోని షిర్డీలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరాన్ని రాత్రి వేళల్లో మూసివేయనున్నట్లు సంస్థాన్ వెల్లడించింది. కర్ఫ్యూ సమయంలో సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు. ఆలయంలోని అన్ని సౌకర్యాలు కూడా మూసివేస్తామని భక్తులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.

Also Read:

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?