Amarnath Yatra 2021: కరోనా ఎఫెక్ట్.. వరుసగా రెండో ఏడాది అమర్‌నాథ్ యాత్ర రద్దు..

Amarnath Yatra Cancelled: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం కూడా ముందు ముందు పొంచిఉందని

Amarnath Yatra 2021: కరోనా ఎఫెక్ట్.. వరుసగా రెండో ఏడాది అమర్‌నాథ్ యాత్ర రద్దు..
Amarnath Yatra 2021

Updated on: Jun 22, 2021 | 6:06 AM

Amarnath Yatra Cancelled: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం కూడా ముందు ముందు పొంచిఉందని పలు అధ్యయానాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో యాత్రికులు చేప‌ట్టే అమ‌ర్‌నాధ్ యాత్ర‌ను వ‌రుస‌గా రెండో ఏడాది కూడా అధికారులు ర‌ద్దు చేశారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా సార‌ధ్యంలో సోమ‌వారం జ‌రిగిన అమ‌ర్‌నాధ్ ఆల‌య బోర్డు స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కూడా అమ‌ర్‌నాధ్ యాత్ర‌ను ర‌ద్దు చేయాల‌ని బోర్డు నిర్ణయం తీసుకుంది.

అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను నిలిపివేసినా.. ఆచారాలు, సంప్ర‌దాయాల ప్ర‌కారం అన్ని పూజా క్ర‌తువులు య‌థావిథిగా జరగనున్నాయి. ప‌విత్ర ప‌ర్వ‌త గుహ‌ల్లో కొలువు తీరిన ఆల‌యంలో నిత్య క్రతువులు నిర్వ‌హిస్తామ‌ని ఆల‌య బోర్డు స‌మావేశానంత‌రం ఎల్జీ మ‌నోజ్ సిన్హా పేర్కొన్నారు. ఆల‌య బోర్డు సభ్యుల‌తో చ‌ర్చించిన అనంతరం కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది కూడా అమ‌ర్‌నాధ్ యాత్ర‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్ర‌జాఆరోగ్యం దృష్ట్యా.. ఈ యాత్ర‌ను నిర్వ‌హించ‌డం స‌రైంది కాద‌ని సిన్హా ట్వీట్ చేశారు.

అయితే.. వర్చువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్‌నాథ్‌ బోర్డు పేర్కొంది. 56 రోజులపాటు జరిగే అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 28న ప్రారంభమై ఆగష్టు 22న ముగుస్తుంది. కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్ర రద్దు కావడం ఇది రెండోసారి. గతేడాది కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Also Read:

Lord Venkateswara Idol: తమిళనాడులో బయటపడిన అతి పురాతన వేంకటేశ్వర స్వామి విగ్రహం.. తిరుమలేశుడి కంటే..

Delta Variant: డెల్టా వేరియంట్‌తో యమా డేంజర్.. అప్రమత్తంగా వుండాలంటున్న శాస్త్రవేత్తలు