ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వరస్వామి స్వయంగా వెలసినట్లు పురాణాల కథనం. ఈ క్షేత్రంలో చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా లక్ష పెన్నులు పంపిణీ చేశారు. స్వామి వారికీ గణపతి పూజ, సరస్వతి కల్పం, సరస్వతి మండపా ఆరాధన, సప్తనదీ జలాబిషేకం, గరికపూజ, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి వారికి పెన్నులతోనే అభిషేకం నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామి వారి పాదాల చెంత లక్ష కలములు ఉంటి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పెన్నులు తీసుకునేందుకు విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి క్యూ కట్టారు విద్యార్థులు. స్వామి వారి పాదాల చెంత ఉంచిన కలం విద్యాభివృద్ధికి తోడ్పడుతుందనేది భక్తుల విశ్వాసం. మూడు వారాలు పాటు పెన్నుల పంపిణీ జరుగుతుందని ఆలయ ఈఓ ప్రకటించారు. ఎంత మంది వచ్చిన పెన్నులు పంపిణి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులకు విఘ్నేశ్వర స్వామి కలం ఎంతగానో ఉపయోగపడుతుందన్న ధృడమైన సంకల్పంతో పంపిణీ చేస్తున్నామన్నారు. స్వామి వారి పాదాలా దగ్గర ఉంచిన పెన్నులు తీసుకునేందుకు విద్యార్థులు పోటీపడ్డారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..