Akkineni Nagarjuna: స్వామివారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున.. రెండేళ్ల తర్వాత..

|

Jan 21, 2022 | 12:06 PM

తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు..ఇవాళ ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున,ఆయన సతీమణి అక్కినేని అమలలు స్వామి వారి సేవలో..

Akkineni Nagarjuna: స్వామివారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున.. రెండేళ్ల తర్వాత..
Nagarjuna Amala
Follow us on

తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు..శుక్రవారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు స్వాగతం‌ పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.

దర్శనం ముగించుకుని ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామి వారిని దర్శించుకో లేక పోయాంమని అన్నారు. ఇవాళ స్వామి వారి ఆశీస్సులు పొందాంమని.. అలాగే ఈ ఏడాది ప్రపంచ ప్రజలందరికి అందరికి మంచి జరగాలని శ్రీవారిని కోరుకున్నట్లుగా అక్కినేని నాగార్జున చెప్పారు.

అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడే వీడియో..

Nagarjuna Amala