Spiritual News: ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా.? బ్యాడ్‌ లక్‌ తప్పదు..

స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్‌లను ఇస్తుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో వస్తువును ఎంచుకుంటారు. అయితే ధర ఎక్కవనో, ఆకర్షణీయంగా ఉందనో ఏ వస్తువు పడితే, అది బహుమతిగా ఇస్తే మంచిది కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి.?

Spiritual News: ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా.? బ్యాడ్‌ లక్‌ తప్పదు..
Gifts

Updated on: Nov 05, 2023 | 1:34 PM

పుట్టన రోజు మొదలు, గృహ ప్రవేశం వరకు ఏ చిన్న ఈవెంట్‌ జరిగినా బహుమతులు ఇస్తుండడం సర్వసాధారణమైన విషయం. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్‌లను ఇస్తుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో వస్తువును ఎంచుకుంటారు. అయితే ధర ఎక్కవనో, ఆకర్షణీయంగా ఉందనో ఏ వస్తువు పడితే, అది బహుమతిగా ఇస్తే మంచిది కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి.? వాటిని ఇస్తే ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..

* బహుమతులుగా ఇవ్వకూడని వస్తువుల్లో అక్వేరియం ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ అక్వేరియంలను బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో ఆకర్షణగా వస్తువుగా ఉపయోగపడే అక్వేరియంను బహుమతిగా ఇవ్వడం వల్ల మీరు మీ కర్మ, శ్రేయస్సును వారికి అందజేసినట్లు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

* ఇక ఎట్టి పరిస్థితుల్లో పదునైన వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఇలాంటి వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల బహుమతి ఇచ్చే వారితో పాటు, తీసుకునే వారికి కూడా ప్రమాదం. కత్తులు, కత్తెరలు లాంటి పదునైన వస్తువులు దురదృష్టాన్ని తెస్తాయి. పదునైన వస్తువులు గిఫ్ట్‌గా ఇస్తే.. వ్యతిరేక, ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

* ఇక చాలా మంది బహుమతిగా వాచ్‌లను ఇస్తుంటారు. అయితే ఇది అంత మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గోడ గడియారాలను బహుమతులుగా అస్సలు ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా బహుమతి ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వకూడని వస్తువుల్లో వాలెట్ ఒకటి. పర్స్‌లు డబ్బును దాచుకునే ఇలాంటి వస్తువులను మరొకరి ఇవ్వడం వల్ల మీ సానుకూల ఆర్థిక శక్తిని బయటకు పంపుతున్నట్లు అవుతుందని, దీనివల్ల ధనం మీ వద్ద నిలబడదని వాస్తు పండితులు చెబుతున్నారు.

* చాలా మంది పెన్నులు, స్టేషనరీ వంటి వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి వస్తువులను బహుమతిగా ఇస్తే తీసుకున్న వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు పలువురు జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు, పలు పుస్తకాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..