Stone Floating in Water: ప్రకృతి లో ఎప్పుడు వింతలు ఎప్పుడూ మనిషి మేధస్సును సవాల్ చేస్తూనే ఉంటాయి. శాస్త్రజ్ఞులు కనిపెట్టిన అనేక విషయాలను ప్రశ్నిస్తూనే ఉంటాయి. పైన ఉన్న ఏ వస్తువైనా కింద పడుతుంది. దానికి కారణం గురుత్వాకర్షణ శక్తి అని శాస్త్రజ్ఞులు తెలిపారు. అయితే ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆశ్సర్యక్రమైన వింతలుఅనేకం మనదేశంలో ఉన్నాయి. వాటిల్లో ప్రముఖ స్థానం చోటు చేసుకుంది.. రామసేతు నిర్మాణంలో వాడబడిన రాళ్ళూ.. అవును అవి నీటిపై తేలియాడుతూ.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.. అయితే తాజాగా హరిద్వారా లో జరుగుతున్న కుంభమేళా లో కూడా ఈ వింత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోప్రముఖ ఆధ్యాత్మిక మేళా కుంభమేళా జరుగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఈ కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర గంగానదిలో భక్తితో స్నానమాచరిస్తున్నారు. అయితే ఈ భక్తులకు మరో ఆశ్చర్యకరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. అదే గంగానదిలో తేలియాడుతున్న రామసేతు రాళ్లు. ఈ రాళ్లను దర్శించుకుని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముని పేరుతో నీటిలో తేలియాడిన రాళ్లు ఇప్పుడు మహాకుంభమేళాలోనూ దర్శనమిస్తున్నాయి. వీటిని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. వీటిని రామసేతు నిర్మాణంలో వినియోగించారని చెబుతుంటారు.
రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. సీత కోసం లంకకు వెళ్లడానికి రాముడు తన సైన్యం తో నిర్మించిన వారధి.. రామ సేతు.. రామ సేతు వద్ద ఉన్న సముద్రం పై రాళ్ళను వేస్తే.. అవి ఆ నీటిలో తేలుతాయట.. కానీ ఒక్కప్పుడు ఇక్కడ కూడా రాళ్ళు నీటిలో మునిగిపోయేవట.. అప్పుడు వానర సైన్యం అంతా ఆ రాళ్ళపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్ళు మునిగిపోవడం లేదని భక్తుల విశ్వాసం.. ఇక ఈ రామ సేతు నిర్మాణం నలుడనే వానరుని సారధ్యంలో జరిగిందని.. ఈ నిర్మాణంలో కోటిమంది వానరులు పాల్గొన్నారని అంటారు. అంతేకాదు ఈ రామసేతును ఐదు రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో పేర్కొన్నారు. ఈ వారధి రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి నుంచి శ్రీలంక దగ్గరున్న మన్నార్ తీరం వరకూ నిర్మించినట్లు పురాణాల కథనం.
Also Read: ఉగాది స్పెషల్ రాయలసీమ స్పెషల్ ‘పాల పోళీ’లు తయారీ విధానం తెలుసుకుందాం..!
బాటిల్స్ తో పాలు తాగుతున్న మేకపిల్లలు.. టెయిల్ పవర్ చూడమంటున్న ఆనంద్ మహేంద్ర