కోట్లాది మంది హిందువుల కల.. రాములోరి జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం తీరుతున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామ మందిరం చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014 జనవరిలో రామాలయం ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అయోధ్యలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ మందిర చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పంచుకుంది. ఇది 500 సంవత్సరాల పోరాటం.. సంకల్ప ఫలితమని పేర్కొంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని X పేజీలో షేర్ చేశారు.
అయోధ్యలోని రామమందిర నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో యాత్రికులు రామయ్య విగ్రహాన్ని దర్శించుకోగలరని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. అయితే ఆలయ ప్రాణ ప్రతిష్ట (పవిత్ర) తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆయన చెప్పారు. జనవరి 26, 2024లోపు యాత్రికులు రాముడిని.. బలరాముడిగా దర్శించుకోగలరని మిశ్రా చెప్పారు.
ఆలయాన్ని 12 గంటల పాటు తెరిచి ఉంచితే 70,000 నుంచి 75,000 మంది సులభంగా దర్శనం చేసుకోవచ్చని మిశ్రా చెప్పారు. ఆలయ నిర్మాణానికి ప్రజల నుంచి డబ్బులు, వస్తువులు విరాళాలుగా వస్తున్నాయని.. రామాలయం నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పారు. అంతేకాదు రామాలయ నిర్మాణానికి విరాళాల ద్వారా సుమారు రూ.3,500 కోట్లు సేకరించామని తెలిపారు.
అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ట్రస్టు పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..