సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 14న ఏర్పడింది. అయితే ఈ చంద్ర గ్రహణం ఏర్పడిన కాలమానం వలన భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్ర గ్రహణం తరువాత తదుపరి గ్రహణం ఇదే నెలలోనే రెండో గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సూర్యగ్రహణం రూపంలో ఉంటుంది. ఇప్పుడు హోలీ తర్వాత మార్చి 2025 లో తదుపరి గ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఎప్పుడు సంభవిస్తుంది? ఆ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి..
2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29, 2025న ఏర్పడుతుంది. ఇది కంకణాకార సూర్యగ్రహణంగా ఏర్పడనుందని తెలుస్తోంది. అంటే చంద్రుడు సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తాడు. ఈ సూర్యగ్రహణం మార్చి 29, 2025న మధ్యాహ్నం 2:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:14 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఖగోళ సంఘటన పాల్గుణ మాసం అమావాస్య రోజున ఏర్పడనుంది.
ఈ సంవత్సరం ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక ఈ గ్రహణ సూతక కాలం కూడా చెల్లదు. దీనికి ముందు ఈ సంవత్సరం ఏర్పడిన మొదటి చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించలేదు.
ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం బెర్ముడా, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, ఆస్ట్రియా, ఉత్తర రష్యా, స్పెయిన్, బెల్జియం, కెనడా తూర్పు భాగం, సురినామ్, మొరాకో, గ్రీన్‌ల్యాండ్, స్వీడన్, బార్బడోస్, డెన్మార్క్, లిథువేనియా, హాలండ్, పోర్చుగల్, పోలాండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది.
జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం కళ్లకు ఎటువంటి రక్షణ లేకుండా చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.. అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం సరైనది కాదు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల రెటీనాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్ళు దెబ్బతింటాయి. దృష్టి మసకబారే అవకాశం కూడా ఉంది. కనుక సూర్యగ్రహాన్ని నేరుగా చూసే ప్రయత్నం వద్దు. కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు కేతువులు సూర్య చంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ఒక ప్రత్యేక ఖగోళ దృగ్విషయం. ఇది సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో చంద్రుడు కొంత సమయం పాటు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. అప్పుడు సూర్యకాంతి భూమి మీద పడదు. భూమిపై చీకటి ఏర్పడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు