
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఈ రోజు మాజీ శాలివాహన సంఘ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర సతీ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నాగేంద్ర దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన అనంతరం శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి అష్టలక్ష్మి కాసులపేరు బహుకరణగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావుకు అందజేశారు. బహుకరించిన ఆభరణాల విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని భక్తులు పేర్కొన్నారు. స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కును తీర్చుకున్న నాగేంద్ర దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను జ్ఞాపికను అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..