Ramayana in Odisha: పిల్లల కోసం ‘పిలక రామాయణం’.. ఒడిశాలో పదేళ్ల బాలుడి అసాధారణ ప్రతిభ..!

|

Feb 28, 2021 | 10:27 PM

Ramayana in Odisha: స్కూల్‌ హాలీడేస్‌ వస్తే.. చాలు పిల్లలు ఆటలకే ఎక్కువ ప్రధానం ఇస్తారు.. లేదంటే, తల్లిదండ్రులు పలు రకాల..

Ramayana in Odisha: పిల్లల కోసం ‘పిలక రామాయణం’.. ఒడిశాలో పదేళ్ల బాలుడి అసాధారణ ప్రతిభ..!
Follow us on

Ramayana in Odisha: స్కూల్‌ హాలీడేస్‌ వస్తే.. చాలు పిల్లలు ఆటలకే ఎక్కువ ప్రధానం ఇస్తారు.. లేదంటే, తల్లిదండ్రులు పలు రకాల కోచింగ్‌ సెంటర్లలో జాయిన్‌ చేస్తారు. కానీ, ఓ బుడ్డొడు మాత్రం కరోనా లాక్‌డౌన్‌ సెలవులను రామాయణానికి అంకితమిచ్చాడు. అవును మీరు విన్నది నిజమే. లాక్‌డౌన్‌ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఏకంగా రామాయణాన్ని రచించాడు.. ఈ పదేళ్ల బాలుడు.

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల అందరూ బిజీ లైఫ్ నుంచి కొంతకాలం పాటు డిస్ట్రాక్ట్ అయ్యారు. ఆ టైమ్‌లో ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా చాలా మంది తమలో దాగి ఉన్న కళను బయటకు తీసే ప్రయత్నం చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆర్ట్ ప్రాక్టీస్, ఫార్మింగ్, ఫిట్‌నెస్ ఇంకా పలు అంశాలపై పట్టు సాధించేందుకు తమదైన కృషి చేయగా, ఒడిషాకు చెందిన ఈ పదేళ్ల బాలుడు మాత్రం..తన మాతృభాషలో రామాయణాన్ని రచించాడు.

భువనేశ్వర్‌కు చెందిన ఆయుష్ కుమార్ ఖుంతియా.. ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు పుస్తకాలు, చదవటం, డీడీ చానల్‌లో ప్రసారమయ్యే రామాయణం చూస్తుండేవాడు. అలా తను చూసిన రామాయణం ఎపిసోడ్లను పుస్తక రూపంలో రాయలనుకున్నాడు. హిందీలో ప్రసారమైన రామాయణ ఎపిసోడ్‌ను చూస్తూ.. తన మాతృభాష ఒడియాలో నోట్ బుక్‌లో రాయడం స్టార్ట్ చేసి, రెండు నెలల్లో పూర్తి చేశాడు. ఆ పుస్తకానికి ‘పిలక రామాయణ’ అని నామకరణం కూడా చేశాడు. రాముడి 14 ఏళ్ల వనవాసం, సీతాదేవిని రావణుడు అపహరించడం, అయోధ్య రాముడికి ప్రజలు ఎలా స్వాగతం పలికేవారు తదితర అంశాలను వివరించాడు. తనలాంటి పిల్లల కోసం ఈ ‘పిలక రామాయణ’ ను రాసినట్లు ఆయుష్ కుమార్ కుంతియా చెప్పుకొచ్చాడు.

Also read:

Kalvakuntla Kavitha: మరోసారి దాతృత్వం చాటిన ఎమ్మెల్సీ కవిత.. భర్తను కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న మహిళకు తానున్నానని భరోసా..

తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం