గంటల వ్యవధిలో గుండెపోటుతో తండ్రీ కొడుకుల మృతి
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కొడుకు చనిపోయిన కొద్ది గంటల్లోనే తండ్రి కనుమూశాడు. కరోనా అనుమానంతో ప్రవేట్ ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాని బంధువులు ఆరోపించారు.

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కొడుకు చనిపోయిన కొద్ది గంటల్లోనే తండ్రి కనుమూశాడు. కరోనా అనుమానంతో ప్రవేట్ ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాని బంధువులు ఆరోపించారు. బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన వెంకటకృష్ణ ఉన్నట్లుండి ఒక్కసారిగా గుండె నొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తరలించారు. అయితే, కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో అడ్మిట్ చేసుకోవడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో గుండెనొప్పి తీవ్రం కావడంతో తుదిశ్వాస విడిచాడు. అటు, కొడుకు వెంకటకృష్ణ మరణాన్ని తట్టుకోలేక అతని తండ్రి వెంకటేశ్వర్లు కూడా చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే ఇద్దరు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధతో తల్లడిల్లుతున్నవారిని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండాపోయిందని వాపోయారు.