Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanmakonda Man Arrested: ఢిల్లీ మైనర్‌ బాలికను హన్మకొండకు రప్పించి అత్యాచారం.. మధురైలో అరెస్టు..!

Hanmakonda Man Arrested: ఢిల్లీ బాలికపై తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆ బాలికను...

Hanmakonda Man Arrested: ఢిల్లీ మైనర్‌ బాలికను హన్మకొండకు రప్పించి అత్యాచారం.. మధురైలో అరెస్టు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 27, 2021 | 10:30 PM

Hanmakonda Man Arrested: ఢిల్లీ బాలికపై తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆ బాలికను ఢిల్లీ నుంచి హన్మకొండకు రప్పించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చివరికి బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హన్మకొండ రెడ్డి కాలనీకి చెందిన నూనె మురళీకృష్ణ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు సంవత్సరాల కిందట పరిచయం ఏర్పడింది. ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల కిందట సదరు బాలికను మురళీకృష్ణ హన్మకొండకు పిలిపించి తన గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే ఇంట్లో తన కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఢిల్లీ రాణిగంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోన్‌కు హన్మకొండలో ఉంటున్న మురళీకృష్ణ ఫోన్‌ నుంచి తరుచుగా కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసును హన్మకొండకు మార్చారు. బాలిక తల్లిదండ్రులు ఈనెల 14న హన్మకొండకు వచ్చి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉంటే పోలీసులకు పట్టుబడతానని గమనించిన మురళీ కృష్ణ.. బాలికను వేరే చోటుకు తీసుకెళ్లాడు.

ఆ తర్వాత ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడులోని మధురైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో చేసిన తప్పును అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: ఆస్పత్రికి తరలించాలన్న పోలీసుల అభ్యర్థన కొట్టివేత, మదనపల్లె జంట హత్యల కేసులో తల్లిదండ్రులకు14 రోజుల రిమాండ్

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు