YS Sharmila: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ షర్మిల పర్యటన.. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో స్వాగతం

సరికొత్త రాజకీయపార్టీతో తెలంగాణ పాలిటిక్స్ లోకి అరంగేట్రం చేసిన వైయస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల ఇవాళ(బుధవారం) ములుగు జిల్లాలో పర్యటించారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో

YS Sharmila: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ షర్మిల పర్యటన.. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో స్వాగతం
Ys Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 18, 2021 | 7:13 PM

YSRTP: సరికొత్త రాజకీయపార్టీతో తెలంగాణ పాలిటిక్స్ లోకి అరంగేట్రం చేసిన వైయస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల ఇవాళ(బుధవారం) ములుగు జిల్లాలో పర్యటించారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం షర్మిల స్థానికులతో భేటీ అయ్యారు. అనంతరం తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో పోడు రైతులను పరామర్శించారు.

Sharmila

Sharmila

ఈ సందర్భంగా ఆదివాసీ ఆచార సంప్రాయాలతో షర్మిలకు స్థానిక గిరిజనులు ఘన స్వాగతం పలికారు. కాగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్నర్ డా.త‌మిళిసై సుంద‌ర రాజ‌న్ వారి త‌ల్లి శ్రీమ‌తి కృష్ణ కుమారి మృతి బాధాక‌రమని షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. గ‌వ‌ర్నర్ కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని షర్మిల ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇలా ఉండగా, తెలంగాణలో నిరుద్యోగులు ఎవరూ దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండని వైయస్ఆర్‌టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల అభ్యర్థించారు. మీ పక్షాన నేను నిలబడ్డాను, కొట్లాడుతున్నాను.. మీ అక్కగా మీకు అండగా మీ పోరాటాన్ని భూజానేసుకొని ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్ష చేస్తున్నాను అని ఆమె అన్నారు. అధైర్యపడకండి.. KCR ముక్కుపిండి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇప్పిస్తానని షర్మిల తెలంగాణ యువతకు అభయమిచ్చే ప్రయత్నం చేశారు.

ఇలా ఉండగా, వైయస్ షర్మిల నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలంలోని గుండెంగి గ్రామంలో షర్మిల నిరుద్యోగ దీక్షకు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఆగస్టు 15న ఉద్యోగ ఖాళీల భర్తీ పై క్లారిటీ ఇస్తారని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైందన్నారామె. అసలు మీకు మనసంటూ ఉందా? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికెషన్స్ ఇస్తారు అంటూ సీఎం కేసీఆర్‌ను నిలదీశారు షర్మిల.

Read also: Short Film Competitions: ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..