
విజయవాడ: తనకు ఒక్క అవకాశం ఇచ్చి…వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని విజయవాడ వైపీసీ పార్లమెంట్ అభ్యర్థి పీవీపి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుతో కలిసి పర్యటించారు. కేవలం ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. స్వార్థపూరిత రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు. వ్యక్తిగత దూషణలు చేసే వారికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని..రానున్నది జగన్ ప్రభుత్వమే ఆయన వ్యాఖ్యానించారు. తాను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని..ఆ కష్టాలేంటో తనకి తెలసని పీవీపి అన్నారు. ఐదేళ్లు అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించిన స్థానిన పార్లమెంట్ సభ్యుడు చేసిన అభివృద్ది శూన్యమని ఆరోపించారు. నీచ రాజకీయాలు, దిగజారుడు వ్యాఖ్యాలు తనకు తెలియవన్న పీవీపి..జగన్ ప్రభంజనం ముందు ఈ సారి ఎవరూ అడ్డు నిలవలేరని జోస్యం చెప్పారు.