వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు: ఆనందంలో బాబు

| Edited By:

Sep 04, 2019 | 4:33 PM

ఎన్నికల సమయాల్లో పలు పార్టీల్లోకి నేతలు జంప్ అవడం కామన్‌నే. వారికున్న అంచనా ప్రకారం.. పార్టీల బలం ప్రకారం నేతలు పార్టీలు మారుతూంటారు. అంతేగాక.. ఇప్పుడు.. పార్టీల్లో.. ఎన్నో ఏళ్ల క్రితం ఉండే నేతలు కూడా పార్టీ మారడం షాక్‌ ఇస్తున్న విషయమే. అందులోనూ.. పార్టీ జంప్‌ అవ్వాలని చూస్తోన్న నాయకులకు.. బీజేపీ.. భలే ఆఫర్లు ఇస్తోంది కూడా. దీంతో.. ఎవరు ఎప్పుడు పార్టీలు మారతారో అనేది కాస్త విస్మయానికి గురిచేస్తున్న విషయమే. కాగా.. ఇప్పుడు అధికార […]

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు: ఆనందంలో బాబు
Follow us on

ఎన్నికల సమయాల్లో పలు పార్టీల్లోకి నేతలు జంప్ అవడం కామన్‌నే. వారికున్న అంచనా ప్రకారం.. పార్టీల బలం ప్రకారం నేతలు పార్టీలు మారుతూంటారు. అంతేగాక.. ఇప్పుడు.. పార్టీల్లో.. ఎన్నో ఏళ్ల క్రితం ఉండే నేతలు కూడా పార్టీ మారడం షాక్‌ ఇస్తున్న విషయమే. అందులోనూ.. పార్టీ జంప్‌ అవ్వాలని చూస్తోన్న నాయకులకు.. బీజేపీ.. భలే ఆఫర్లు ఇస్తోంది కూడా. దీంతో.. ఎవరు ఎప్పుడు పార్టీలు మారతారో అనేది కాస్త విస్మయానికి గురిచేస్తున్న విషయమే.

కాగా.. ఇప్పుడు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి నేతలు మారడం.. నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అరకు నియోజకవర్గానికి చెందిన దొన్ను దొర వైసీపీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. బుధవారం.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి జంప్ అయ్యారు. గత ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసిన దొన్ను దొర 2019 ఎన్నికల్లో0 రెండో స్థానంలో నిలిచారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు మొదలవడంతో.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా.. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ 100 రోజుల పాలనకు ఇద్దే అద్దం లాంటిదని అన్నారు. వంద రోజుల్లో వైసీపీ పార్టీ పనితీరు బయటపడిందన్నారు. ఆ పార్టీ చేస్తోన్న అరాచకాలకు.. టీడీపీ కార్యకర్తలు బలవుతున్నారని.. మాపై దొంగ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. అలాగే.. వైఎస్సార్ కంటే జగన్.. అచారకమైన పాలన చేస్తున్నాడని.. అన్నారు చంద్రబాబు.