YS Sharmila: ఇక, ప్రతి మంగళవారం వైయస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష..! ఎందుకోసం..?

|

Jul 11, 2021 | 7:36 PM

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నడుం బిగించింది. ఉద్యోగం లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు..

YS Sharmila: ఇక,  ప్రతి మంగళవారం వైయస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష..! ఎందుకోసం..?
Ysrtp Sharmila Deeksha
Follow us on

YSRTP Sharmila Tuesday Deeksha: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నడుం బిగించింది. ఉద్యోగం లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ టీపీ అడహక్‌ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్‌ ఖాన్, కృష్ణమోహన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన కానరాలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్‌ క్యాలెండర్ రూపొందించాలని వైయస్ఆర్‌టీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో షర్మిల పార్టీకి నిర్మాత ఈయన, స్క్రిప్ట్, డైరెక్టర్ ఆయన..!

తెలంగాణలో షర్మిల పార్టీకి నిర్మాత జగన్.. స్క్రిప్ట్, డైరెక్టర్ కేసీఆర్ అంటూ  CPI జాతీయ కార్యదర్శి నారాయణ శనివారం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే . వీరిరువురి అనుమతి లేకపోతే షర్మిల తెలంగాణలో తిరుగుతుందా..? అని ఆయన ప్రశ్నించారు నారాయణ. TRS వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే షర్మిల పార్టీ పెట్టిందన్నారు. ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాలు ఆపేస్తే కృష్ణా జలాల సమస్య తీరిపోయినట్లే అని నారాయణ ఘాటు కామెంట్లు చేశారు.

అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం జగన్ కు బెయిల్ రద్దు కాదని నారాయణ అన్నారు. కొవిడ్ నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని చెప్పిన నారాయణ.. కరోనా కారణంగా చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇవ్వలేని కేంద్రం.. కార్పొరేట్ లకు లక్షా ఆరవై కోట్ల రూపాయలు ఇచ్చిందని మండిపడ్డారు. వాజ్ పేయి మంచి రాజకీయ నేత అయితే, మోడీ ఫ్యాక్షనిస్ట్ నేత అని నారాయణ అన్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం సీపీఐ చేస్తున్నట్లు నారాయణ చెప్పారు. ఫాదర్ స్టాన్ సాన్ ది సర్కారు హత్యే అని చెప్పిన నారాయణ, ఇదే దారిలో వరవరావు, సాయిబాబాను చంపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో RBI, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ లను డమ్మీ చేశారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Bonalu: ‘అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..’ అంటూ భాగ్యనగరం సహా యావత్ తెలంగాణం బోనమెత్తుకుంటోంది