Vijayasai Reddy task impossible comments on lokesh : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై దండెత్తారు. నారా లోకేష్ అసమర్ధుడంటూ సొంత పార్టీ సీనియర్ నేతలే బాబుకి చెప్పినా లోకేష్‌పై ఆయనకున్న ప్రేమ.. మోహంగా మారి, సాధించలేని పని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. “రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.” అంటూ విజయసాయి భవిష్యవాణి వినిపించారు. “పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదు. ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నాడు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారం.” అంటూ మరో ట్వీట్లో విజయసాయి చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
Wisdom cannot be imparted. Many senior colleagues reminded this to @NCBN about his son. But, his love for Lokesh has turned into an Infatuation and he is spending Crores of rupees on a task that is impossible to achieve.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2021
పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదు. ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నాడు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2021
రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2021