YSRCP – TDP: కుప్పంలో ఉన్న 37 వేల ఓటర్ల గురించి జనరల్ ఎన్నికల మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా భరించినందుకు బాధ కలుగుతుందని అన్నారు. టీడీపీ, జనసేన ఒకే తాను గుడ్డలని ఎద్దేవ చేశారు. అందరూ కలిసి పోరాడిన వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ క్లీన్ స్వీప్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి చంద్రబాబు చేతుల్లో కుప్పం మగ్గిపోయిందని.. బయట ఓటర్లను తీసుకొచ్చిన అలవాటు చంద్రబాబుకు ఉందన్నారు.
స్థానిక ఎన్నికల్లో మొదటిసారి కుప్పం కోట బద్దలైందన్నారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా అభివృద్ధిని ప్రజలంతా చూస్తున్నారని.. స్థానిక ఫలితాలే కుప్పం టౌన్‌లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫలితాలు అలా రాకపోయినా మునిగిపోయేది ఏమీ లేదన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఎలా అంటారు..? 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఇలాగే అన్నారు. పోలింగ్ బూత్‌లో మీ ఏజెంట్‌లు ఉన్నప్పుడు దొంగ ఓట్లు ఎలా వేస్తారు? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో ఏది జరిగినా చంద్రబాబు ఖాతాలోనే పడుతుందన్నారు. కుప్పంలో టీడీపీ చేసిన అక్రమాల వీడియోలు బయట పెట్టారు సజ్జల.
ఇవి కూడా చదవండి: Chandrababu Naidu: ఏపీలో ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Andhra Pradesh: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు