లోటస్‌పాండ్‌లో విద్యార్థల సందడి.. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకే వచ్చా.. ఇంకేమీ మాట్లాడారంటే..

|

Feb 24, 2021 | 1:16 PM

తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తామంటూ కొత్త పార్టీ ఏర్పాటులో తలమునకలై ఉన్నారు వైయస్‌ షర్మిల. జిల్లాల వారీగా వైయస్‌ఆర్‌ అభిమానులతో..

లోటస్‌పాండ్‌లో విద్యార్థల సందడి.. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకే వచ్చా.. ఇంకేమీ మాట్లాడారంటే..
Follow us on

తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తామంటూ కొత్త పార్టీ ఏర్పాటులో తలమునకలై ఉన్నారు వైయస్‌ షర్మిల. జిల్లాల వారీగా వైయస్‌ఆర్‌ అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నేతలతో మంతనాలు జరిపిన షర్మిల.. తాజాగా విద్యార్థి సంఘాలతో సమావేశమయ్యారు.

లోటస్ పాండ్‌లో వివిధ విశ్వవిద్యాలకు చెందిన విద్యార్థులతో వైఎస్ షర్మిల ముఖా-ముఖి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీతో పాటు వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. నిరుద్యోగం, ఫీజ్ రీయంబర్స్‌మెంట్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. దీంతో వైఎస్ షర్మిల ఇంటి దగ్గర విద్యార్థుల సందడి నెలకొంది.

విద్యార్థులతో వై.యస్.షర్మిల మాట్లాడుతూ నా కొడుకు కూతురు కూడా మీలాగే చదువుతున్న వారే.. అందుకే మీతో మాట్లాడేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము.. మీ అక్కగా మన సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను.. తెలుగు ప్రజలను అందరినీ రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దు అని వైఎస్ బరోసా కల్పించారు. ఫీజ్ రిఎంబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేదని షర్మిల గుర్తు చేశారు.

నేడు ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లంతా ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి నీ గుర్తు పెట్టుకుంటారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్సార్ ది. అక్షరం గుండెల్లో ఇప్పటికీ వైఎస్సార్ బ్రతికే ఉంటారు.
ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజం కావాలి. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు. అందరి నిరీక్షణ ఫలించాలి అంటే ఒక మంచి సమాజం రావాలి అంటూ విద్యార్థులనుద్దేశించి షర్మలి ప్రసంగించారు.

Read more:

మంత్రి ఎర్రబెల్లితో కవిత సహా ఎమ్మెల్సీల భేటీ.. మంత్రికిచ్చిన వినతిపత్రంలో ఏముందంటే..