వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం

తాడేపల్లి : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి.. వైఎస్‌ షర్మిల శుక్రవారం గుంటూరు జిల్లా  తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ఆరంభించిన ఆమె… అనంతరం పట్టణంలోని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటు యార్డు భూ సమీకరణ బాధిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని సాయిబాబా మందిరం సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద పసుపు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. […]

వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం

Edited By:

Updated on: Mar 29, 2019 | 7:33 PM

తాడేపల్లి : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి.. వైఎస్‌ షర్మిల శుక్రవారం గుంటూరు జిల్లా  తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ఆరంభించిన ఆమె… అనంతరం పట్టణంలోని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటు యార్డు భూ సమీకరణ బాధిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పట్టణంలోని సాయిబాబా మందిరం సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద పసుపు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ నుంచి నులకపేట మీదుగా డోలాస్‌నగర్‌ చేరుకుని అక్కడ మహిళా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మంగళగిరి పట్టణానికి చేరుకుని, సాయంత్రం 7 గంటలకు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us