చేసిన అభివృద్ధి చెప్పండి చంద్రబాబు: జగన్

 గూడూరు: ‘పాదయాత్రలో ప్రజలు నాతో చెపుకున్న బాధలు, నేను చూసిన వారి కష్టాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని ప్రతిపక్షనేత,  వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వరప్రసాద్‌, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి […]

చేసిన అభివృద్ధి చెప్పండి చంద్రబాబు: జగన్
Follow us

|

Updated on: Mar 31, 2019 | 4:31 PM

 గూడూరు: ‘పాదయాత్రలో ప్రజలు నాతో చెపుకున్న బాధలు, నేను చూసిన వారి కష్టాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని ప్రతిపక్షనేత,  వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వరప్రసాద్‌, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ను ఆదరించి.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

తన తండ్రి పాలనలో జరిగినట్టుగా.. ప్రతి రైతు కుటుంబం ఆనందంతో ఉండేలా చూస్తానని జగన్ హామి ఇచ్చారు. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకు…పాలన వ్యవస్థలో అసలు చోటివ్వకండని ప్రజలకు పిలుపునిచ్చారు. చేసిన అభివృద్ధిని చెప్పకుండా పదే..పదే ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.