వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్
ఇవాళ రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నాం అన్నారు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉగాది సందర్భంగా తన పార్టీ మేనిఫెస్టోను జగన్ ప్రకటించారు. ప్రత్యేకహోదాను సాధించి తీరుతామని చెప్పిన జగన్.. నవరత్నాలను ప్రధాన అంశంగా ఈ మేనిఫెస్టోలో పొందపరచామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి ప్రజలకు చూపిస్తానని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు * ప్రతి రైతు కుటుంబానికి రూ.50వేల పెట్టుబడి సాయం. మే నెలలో పంట […]
ఇవాళ రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నాం అన్నారు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉగాది సందర్భంగా తన పార్టీ మేనిఫెస్టోను జగన్ ప్రకటించారు. ప్రత్యేకహోదాను సాధించి తీరుతామని చెప్పిన జగన్.. నవరత్నాలను ప్రధాన అంశంగా ఈ మేనిఫెస్టోలో పొందపరచామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి ప్రజలకు చూపిస్తానని జగన్ పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు * ప్రతి రైతు కుటుంబానికి రూ.50వేల పెట్టుబడి సాయం. మే నెలలో పంట వేసే సమయానికి రూ.12,500 ఇస్తాం. రైతన్నకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. * వ్యవసాయానికి పగటి పూట 9గంటల ఉచిత విద్యుత్. * ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగిలను ఏర్పాటు చేస్తాం. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. * కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. * వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు వారికి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు, అన్ని రకాల ఆపరేషన్లు ఆరోగ్యశ్రీకి వర్తింపజేస్తాం. * పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు. * వికలాంగులకు రూ.3వేల భృతి. * ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం. * తలసేమియా వ్యాధిగ్రస్థులకు రూ.10వేల పెన్షన్. * పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తాం. * 50ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తాం. * ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ అందేలా చేస్తాం. * 2లక్షల 50వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తెస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకు అందేలా చేస్తాం. *మూడు దశల్లో మద్యనిషేధం. మద్యాన్ని ఫైవ్‌స్టార్ హోటల్స్‌కే పరిమితం చేస్తాం. * అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు కేటాయిస్తాం. * సొంత ఆటో, టాక్సీ నడిపే వారికి ఏడాదికి రూ.10వేల సాయం. *ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఎస్సీ, ఎస్టీలకు ప్రమాద బీమా రూ.5లక్షలు. * ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తాం. * బీసీ ఉపకులాలకు ప్రత్యేక కార్పోరేషన్. శాశ్వత ప్రాతిపదికన బీసీ సబ్‌ప్లాన్‌ను తీసుకొస్తాం. * మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ.24వేల ఆర్థిక సాయం. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. * కాపు కార్పోరేషన్‌కు ఏడాదికి రూ.2వేల కోట్లు. * అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహాలను కట్టించి ఇస్తాం. * క్రిస్టియన్ మైనారిటీలకు ప్రమాద బీమా రూ.5లక్షలు. * అగ్రకులాలకు కార్పోరేషన్‌లు కేటాయించి నిధులు కేటాయిస్తాం. * రాజధానిని ఫ్రీజోన్ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. * 18ఏళ్ల నుంచి 60ఏళ్ల లోపు వారు సహజంగా మరణించినా.. వైఎస్ఆర్ జీవన బీమా కింద రూ.లక్ష అందిస్తాం. * ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా రూ.లక్ష అందిస్తాం. * జర్నలిస్టులకు వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు. * అర్చకుల పదవీ విరమణ నిబంధన రద్దు. అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు. దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు. దేవాలయాలకు పంచాయతీ జనాభా ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 35 వేలు. * తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ. * ఉద్యోగులు కోరుకున్న విధంగా 26 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ అమలు. * అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్. సీనియారిటీ, అర్హతలను బట్టి రెగ్యులరైజేషన్. * పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు.