YS Jagan: నా ప్రతి అడుగులో మీరే నా స్ఫూర్తి.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ పోస్ట్‌!

ఫాదర్స్ డే సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తన తండ్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా ప్రతి అడులో మీరే నా స్పూర్తి.. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తాను తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

YS Jagan: నా ప్రతి అడుగులో మీరే నా స్ఫూర్తి.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ పోస్ట్‌!
Jagan

Updated on: Jun 15, 2025 | 5:02 PM

ఫాదర్స్ డే సందర్భంగా పలువురు రాజకీయ నేతలు తమ తండ్రితో ఉన్న మదుర క్షణాలను స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. వారితో ఆనందంగా ఉన్న ఫోటోలను పంచుకుంటూ తమ తండ్రులపై తమకున్న ప్రేమను తెలియపరుస్తున్నారు. ఇక
ఫాదర్స్ డే సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సైతం తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నా జీవితంలో మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తిగానే నిలిచారు, మీరే నాకు రోల్‌ మోడల్‌, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా’’ అంటూ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. మరోవైపు చారిత్రాత్మకమైన తన తండ్రి పాదయాత్ర ముగింపు రోజును కూడా తాను గుర్తు చేసుకుంటున్నట్టు ఆయన చేసిన పోస్ట్‌ రాసుకొచ్చారు.

తన తండ్రిని స్మరించుకుంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సైతం షేర్ చేసుకుంటూ డాక్టర్ వైఎస్‌ఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..