పోలవరం ప్రాజెక్టు నిండా అవినీతే- జగన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.  పెద్దాపురం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.  మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కనుమరుగు అవుతాయని, ఎల్‌కేజి ఫీజులు కూాడా లక్షల్లో ఉంటాయని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో గిట్టుబాటు ధరలు అందక రైతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నానన్న జగన్… పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతితో  నడుస్తోందని, యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని […]

పోలవరం ప్రాజెక్టు నిండా అవినీతే- జగన్

Updated on: Apr 01, 2019 | 6:53 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.  పెద్దాపురం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.  మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కనుమరుగు అవుతాయని, ఎల్‌కేజి ఫీజులు కూాడా లక్షల్లో ఉంటాయని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో గిట్టుబాటు ధరలు అందక రైతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నానన్న జగన్… పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతితో  నడుస్తోందని, యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు.  బాబుకి ఓటేస్తే మీ ఇళ్ళు, పొలాలు తనకి నచ్చిన రేటుకే లాక్కుంటారని జగన్ ఆరోపించారు. కేవలం భూములు లాక్కోవడానికి భూ సేకరణ చట్టానికి చంద్రబాబు సవరణలు చేస్తారని జగన్ ఎద్దేవా చేశారు.