చంద్రబాబు, పవన్ టార్గెట్‌గా విజయసాయి రెడ్డి ట్వీట్

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి కాస్త వైరైటీగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేస్తూ.. ట్వీట్‌లో పేర్కొన్నారు. అమరావతి విషయంలో ఇటీవల జనసేనాని చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. యజమాని చంద్రబాబు, ఆయన ప్యాకేజీ ఆర్టిస్ట్ ప్రస్తుతం కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం […]

చంద్రబాబు, పవన్ టార్గెట్‌గా విజయసాయి రెడ్డి ట్వీట్

Edited By:

Updated on: Sep 03, 2019 | 2:17 PM

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి కాస్త వైరైటీగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేస్తూ.. ట్వీట్‌లో పేర్కొన్నారు. అమరావతి విషయంలో ఇటీవల జనసేనాని చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. యజమాని చంద్రబాబు, ఆయన ప్యాకేజీ ఆర్టిస్ట్ ప్రస్తుతం కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని చంద్రబాబు చెబుతుంటే, కాలం కలిసిరావడం వల్ల, ఈవీఎంల వల్లే వైసీపీ గెలిచిందని ఆయన పార్టనర్ (జనసేనాని ఉద్దేశిస్తూ..) అంటున్నాడని దుయ్యబట్టారు. అలాగైతే 23 సీట్లలో టీడీపీని, జనసేనను ఓ చోట ఎవరు గెలిపించారని ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ కూడా చేశారు.