సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేధికగా విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?” అని వ్యాఖ్యానించారు. ఆపై “35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి ట్రీట్మెంట్ ఇస్తాడు” అంటూ సెటైర్ లు వేశారు.
ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 18, 2019
35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి ట్రీట్మెంట్ ఇస్తాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 18, 2019