YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు..

|

Oct 28, 2021 | 3:31 PM

పీలో రాజకీయ రణరంగం నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పోటాపోటీగా మంతనాలు జరిపారు వైసీపీ, టీడీపీ ఎంపీలు.

YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు..
Ycp Mp Gorantla Madhav And
Follow us on

ఏపీలో రాజకీయ రణరంగం నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పోటాపోటీగా మంతనాలు జరిపారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశం సందర్భంగా లాబీల్లో ఈ సీన్‌ కనిపించింది. ఒకవైపు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, మరోవైపు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అమిత్‌షాతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు.

గోరంట్ల మాధవ్‌ లేఖ ఇచ్చి మరీ చంద్రబాబు, టీడీపీ తీరుపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినప్పటికీ ఇంకా పాలించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి బోధించే పాఠశాలను కేంద్ర హోంశాఖ నెలకొల్పి చంద్రబాబుకు ప్రజాస్వామ్యం నేర్పాలని అన్నారు. బూతులతో దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘చంద్రబాబు స్కూల్ ఆఫ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ ప్రమోషన్’ ఈ పనిలో నిమగ్నమైందని అన్నారు. దుర్భాషలాడడంపై కఠిన చర్యలు తీసుకునేలా అశ్లీలత, అసభ్యతను నిరోధించే చట్టాలను మరింత పటిష్టపర్చాలన్నారు. టీడీపీ నేత పట్టాభి ఉపయోగించిన భాష మైనర్లను ప్రభావితం చేసేలా ఉన్నందున అతనిపై ఫోక్సో చట్టం కింద విచారణ జరిపాలని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ అశ్లీలత, సామాజిక అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. రోజువారీ పరిణామాలను తప్పుగా ప్రమోట్ చేస్తున్నారని గోరంట్ల మాధవ్.

ఇక కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రం కేవలం మాటల రూపంలోనే అమిత్‌షాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును తీసుకుని ముందుకు వెళ్తున్న సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కూడా మాటల రూపంలో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు అందజేయనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..?