ఓటమి పాలైన నాయకుల బరితెగింపులు.. ఆ పంచాయతీలో స్మశాన వాటిక రోడ్డును తవ్వేసిన వైసీపీ నేతలు

|

Feb 25, 2021 | 8:27 AM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉద్రిక్త వాతావరణంలో నాలుగు దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా

ఓటమి పాలైన నాయకుల బరితెగింపులు.. ఆ పంచాయతీలో స్మశాన వాటిక రోడ్డును తవ్వేసిన వైసీపీ నేతలు
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉద్రిక్త వాతావరణంలో నాలుగు దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అనేక వివాదాలు, కోర్టు విచారణల మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు తమ సత్తా చాటారు. అత్యధిక పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

అయితే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఓడిపోయిన వైసీపీ మద్దతుదారుల ఆగడాలకు మాత్రం హద్దు లేకుండా పోతుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే అక్కసుతో వైసీపీ మద్దతుదారులు బరితెగించారు. గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని వైసీపీ నాయకులు తవ్వేశారు. ఈ సంగటన పి.గన్నవరం మండలం లంకలగన్నవరం పంచాయతీ లో చోటు చేసుకుంది.

మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ కి చెందిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వార్డు నెంబర్ గా గెలిచిన వ్యక్తి సహకరించలేదనే అక్కసుతో ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు శ్మశాన వాటికకు, ఇటుకల బట్టికి వెళ్లే దారిని నాయకులు తవ్వేశారంటూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. మాకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు.

ఎన్నికలు ముగిసిన నియోజకవర్గంలో అధికారపార్టీ ఓటమి పాలైన ప్రతిచోటా నాయకుల బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more:

చంద్రబాబు టూర్‌తో కుప్పంలో హైటెన్షన్‌.. వైసీపీ అన్నంత పని చేస్తుందా..? అంత సీన్ లేదంటున్న టీడీపీ..