మోదీకి వ్యతిరేకమవుతోన్న మహిళలు
ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పథకాలను తీసుకొచ్చారు. అయితే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహిళా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా రైతు కూలీలు, సూక్ష్మ వ్యాపారులుగా పనిచేస్తోన్న ఎంతోమంది మహిళలు తమ పనులను పోగొట్టుకుంటున్నారు. దీంతో వారంతా మోదీకి వ్యతిరేకంగా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటేయకూడదని వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వ్యవసాయంలో మహిళా కూలీల అవసరం చాలా ఉంటుంది. పంటను వేయడం మొదలుకొని కోత […]

ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పథకాలను తీసుకొచ్చారు. అయితే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహిళా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా రైతు కూలీలు, సూక్ష్మ వ్యాపారులుగా పనిచేస్తోన్న ఎంతోమంది మహిళలు తమ పనులను పోగొట్టుకుంటున్నారు. దీంతో వారంతా మోదీకి వ్యతిరేకంగా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటేయకూడదని వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
వ్యవసాయంలో మహిళా కూలీల అవసరం చాలా ఉంటుంది. పంటను వేయడం మొదలుకొని కోత వరకు వారి అవసరం ఎంతో ఉంటోంది. అయితే ఇటీవల కాలంలో వ్యవసాయంలో మిషన్ల వాడకం పెరగడంతో వారికి ఉపాధి లేకుండా పోయింది. దీంతో తమ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారిందని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా ప్రాంతంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎవరైతే మా ప్రాంతంలో ఫ్యాక్టరీలను పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇస్తారో వారికే తదుపరి ఎన్నికల్లో ఓటును వేస్తాం’’ అంటూ 40ఏళ్ల మంతాజ్ ములానీ అనే రైతు కూలీ తెలిపింది. మిషన్లు వచ్చిన తరువాత ఉపాధి లేకుండా పోయింది అంటూ తన బాధను ఆమె పేర్కొంది.

ఇక నోట్ల రద్దు, జీఎస్టీకి కూడా మహిళలపై చాలా ప్రభావాన్ని చూపింది. ఇదివరకు చదువులేని చాలా మంది మహిళలు చిన్న చిన్న షాప్‌లలో పనిచేసి తమ కుటుంబాలను నెట్టుకుంటూ వచ్చేవారు. ముఖ్యంగా మురికివాడల్లో నివసించే పలువురు మహిళలు చిన్న చిన్న షాప్‌లలో పనిచేసేవారు. అయితే జీఎస్టీ వచ్చిన తరువాత చిన్న తరహా పరిశ్రమలపై ఆ ప్రభావం చాలా పడింది. దీంతో జీఎస్టీని భరించలేకపోతున్న కొందరు వ్యాపారస్తులు మహిళలను తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో చేసేందుకు కూడా మహిళలకు ఉపాధి దొరకడం లేదు. ఇక ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాలనుకున్న అక్కడ మహిళలకు చాలా తక్కువ డబ్బును ఇస్తున్నారు. అలాగే సురక్షితను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రదేశాలకు వెళ్లేందుకు మహిళలు కూడా ఆలోచిస్తున్నారు. దీంతో అతి కష్టం మీద వారు ఇంటికే పరిమితం అవుతున్నారు.

మహిళలకు ఉద్యోగాలు ఇవ్వలేం నిరక్షరాస్యుల పరిస్థితే కాదు మరోవైపు చదువుకున్న మహిళల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మహిళలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చేందుకు పలు కంపెనీ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. దక్షిణాదికి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ మాట్లాడుతూ.. ‘‘నా ఫ్యాక్టరీలో 1000మంది పురుషులు ఉన్నారు. మహిళలను తీసుకోవాలనుకుంటే వారికి ప్రత్యేక బాత్‌రూమ్‌లు, రాత్రి పూట ట్రాన్స్‌పోర్ట్ సమకూర్చాలి. అంతేకాదు పురుషుల మీద ఫిర్యాదులు పెరుగుతాయి. అందుకే వారిని తీసుకునేందుకు వెనుకడుగు వేశాం’’ అంటూ పేర్కొన్నారు. చిన్న చిన్న కంపెనీలే కాదు మల్టీనేషనల్ కంపెనీలు కూడా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాయి. షిప్ట్‌లు, ట్రాన్స్‌పోర్ట్ విషయంలో మహిళలకు మినహాయింపును ఇవ్వాలని, కానీ పురుషుల విషయంలో వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.

దీనిపై సౌత్ ఏషియా ప్రోగ్రామ్ డైరక్టర్ మిలన్ వైష్ణవ్ మాట్లాడుతూ.. పలు అంశాలలో దేశం ముందుడుగు వేస్తున్నప్పటికీ.. మహిళా నిరుద్యోగుల సంఖ్య మాత్రం పెరుగుతోందని అన్నారు. ఇందుకు ఎన్నో కారణాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఆర్థికంగా భారత్‌కు సమానమైన దేశాలతో పోలిస్తే.. మన దేశంలో మహిళా నిరుద్యోగుల శాతం పెరుగుతోందని వైష్ణవ్ తెలిపారు. మహిళలను ఆకర్షించేందుకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ, మరుగుదొడ్లు వంటి పథకాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినా.. ఉపాధి అవకాశాలు మాత్రం చాలా తగ్గాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కారణాలు ఏవైనా మహిళా నిరుద్యోగులను తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని భావిస్తున్నా.. మహిళల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవల్సి వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.