లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారా..!

| Edited By:

Mar 19, 2019 | 10:51 AM

లోక్‌సభకు తమ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారా..? లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలనుకుంటోన్న కేసీఆర్ అన్ని వైపుల నుంచి ముమ్మర చర్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా తెలిపారు. ఎంపీగా పోటీచేసి తద్వారా జాతీయ […]

లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారా..!
Follow us on

లోక్‌సభకు తమ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారా..? లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలనుకుంటోన్న కేసీఆర్ అన్ని వైపుల నుంచి ముమ్మర చర్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా తెలిపారు. ఎంపీగా పోటీచేసి తద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో మెదక్ నుంచి కానీ నల్గొండ నుంచి కానీ ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో సీఎం పదవిలో తన తనయుడు కేటీఆర్‌ను కొనసాగించి, దేశ రాజకీయాలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారట.

మరోవైపు ఈ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీజేపీకి సరైన మెజార్టీ రాని పక్షంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ అదే పరిస్థితి ఎదురైతే ఒక ఎంపీ చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో కేసీఆర్ పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నారట.

కాగా రెండో సారి బీజేపీ అధికారంలోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా సీఎంగా మరో ఐదు సంవత్సరాలు ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారట. ఇలా కాకుండా సరైన మెజారిటీ లేక అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, టీఆర్ఎస్ మద్దతును కోరితే ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నారట. ఆ క్రమంలో కేంద్రమంత్రిగా తనకు గానీ, తన కుమార్తెకు గానీ అవకాశం ఇవ్వమనేలా కేసీఆర్ ప్రణాళికను వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.