CM Uddhav tweet : ఆ రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపేసుకుంటాం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన ట్వీట్..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే సంచలన ట్వీట్‌ చేశారు. కర్నాటకలో మరాఠీ భాష మాట్లాడుతున్న ప్రాంతాలను మహారాష్ట్రంలో విలీనం చేస్తామంటూ తన అధికారిక ట్విట్టర్‌లో...

CM Uddhav tweet : ఆ రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపేసుకుంటాం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన ట్వీట్..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 7:17 PM

CM Uddhav Thackeray tweet : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే సంచలన ట్వీట్‌ చేశారు. కర్నాటకలో మరాఠీ భాష మాట్లాడుతున్న ప్రాంతాలను మహారాష్ట్రంలో విలీనం చేస్తామంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరాఠీ ప్రాంతాల ఏకీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన యోధులకు నిజమైన నివాళి ఇదేనని రాసుకొచ్చారు. గతంలో బాంబే ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్న బెల్గాంతో సహా వివిశ ప్రాంతాలు తమవే అని అంటోంది మహారాష్ట్ర. బెల్గాంను మహారాష్ట్రలో కలపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి.

మహారాష్ట్ర ఏకీకరణ సమితి బెల్గాంతో సహా మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని చాలా ఏళ్ల నుంచి ఉద్యమిస్తోంది. జనవరి 17వ తేదీని మహారాష్ట్ర ఏకీకరణ సమితి అమరవీరుల దినోత్సవంగా పాటిస్తోంది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కలిపే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఉద్దవ్‌ ప్రకటించారు.

1956 నుంచి బెల్గాంతో సహా వివిధ ప్రాంతాలపై కర్నాటక – మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. బెల్గాం జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని కర్నాటక నేతలంటున్నారు. బెల్గాం, కార్వార్‌, నిప్పని ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు మరాఠీ మాట్లాడుతారని , ఆ ప్రాంతాలు తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది.

కర్నాటక – మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో చాలా ఏళ్ల నుంచి కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులో కేసు పురోగతిని పరిశీలించేందుకు సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇద్దరు మంత్రులతో కమిటీని కూడా నియమించారు.

ఇవి కూడా చదవండి :

తిరుమల ఆలయం పరిసరాల్లో అడవి పందుల సంచారం.. స్పందించిన టీటీడీ అధికారులు

ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా.. దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉందంటూ జీవీఎల్ ఫైర్