జనసేనలో చేరుతున్నట్టు జేడీ లక్ష్మీనారాయణ ప్రకటన
విజయవాడ: ఏపీలో కొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఉదయం 10:30 నిమిషాలకు తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. శనివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరూ సుమారు గంట వరకు చర్చలు జరిపారు. ఈ చర్చ అనంతరం లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు జనసేనలో చేరబోతున్నట్టు […]
విజయవాడ: ఏపీలో కొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఉదయం 10:30 నిమిషాలకు తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. శనివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరూ సుమారు గంట వరకు చర్చలు జరిపారు. ఈ చర్చ అనంతరం లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు.
ఆదివారం ఉదయం 10:30 గంటలకు జనసేనలో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. జేడీ లక్ష్మీనారాయణ సొంత పార్టీ నడుపుతారని, టీడీపీలో చేరబోతున్నారని, లేదు ఈ ఎన్నికల్లో క్రీయాశీలకంగా ఉండరంటూ పలు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఆయన విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లైంది.