బాబు వృధా ప్రయాస… నీళ్లు చల్లిన శివసేన

| Edited By:

May 20, 2019 | 4:34 PM

బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న విప‌క్షాలపై శివ‌సేన విరుచుకుపడింది. మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే లోపు ప్ర‌తిప‌క్ష కూటమిలోని పార్టీల‌న్నీ చెల్లాచెదురవుతాయని ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. చిన్న‌పార్టీల‌ను జ‌త చేసుకుని జ‌ట్టు క‌డుదామ‌నుకుంటున్న ప్ర‌య‌త్నాల‌న్నీ వీగిపోతాయ‌ని.. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో వెల్లడించింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను సామ్నా నిల‌దీసింది. అటూ ఇటూ తిరుగుతూ చంద్ర‌బాబు ప్ర‌యాస‌ప‌డుతున్నార‌ని.. మ‌హాకూట‌మి నుంచి క‌నీసం అయిదు మంది ప్ర‌ధాని ప‌ద‌వి […]

బాబు వృధా ప్రయాస... నీళ్లు చల్లిన శివసేన
Follow us on

బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న విప‌క్షాలపై శివ‌సేన విరుచుకుపడింది. మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే లోపు ప్ర‌తిప‌క్ష కూటమిలోని పార్టీల‌న్నీ చెల్లాచెదురవుతాయని ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. చిన్న‌పార్టీల‌ను జ‌త చేసుకుని జ‌ట్టు క‌డుదామ‌నుకుంటున్న ప్ర‌య‌త్నాల‌న్నీ వీగిపోతాయ‌ని.. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో వెల్లడించింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను సామ్నా నిల‌దీసింది. అటూ ఇటూ తిరుగుతూ చంద్ర‌బాబు ప్ర‌యాస‌ప‌డుతున్నార‌ని.. మ‌హాకూట‌మి నుంచి క‌నీసం అయిదు మంది ప్ర‌ధాని ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నార‌ని, వారి క‌ల‌ల‌న్నీ ప‌టాపంచ‌లు కాబోతున్న‌ట్లు ఎడిటోరియ‌ల్‌లో పేర్కొంది.

చిన్న చిన్న పార్టీల కూట‌మితో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి లేద‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత అస్థిర ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, దాని నుంచి లాభం పొందేందుకే చంద్ర‌బాబు ఢిల్లీలో క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని, కానీ అది నిజం కాదని పత్రిక వెల్లడించింది. చంద్ర‌బాబు కూట‌మి కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, కానీ ఆయ‌న ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతాయ‌ని, ఢిల్లీలో రెండుసార్లు శ‌ర‌ద్ ప‌వార్‌ను క‌లిశార‌ని, కానీ ఆ కూట‌మి 23వ తేదీ వ‌ర‌కు క‌లిసి ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని శివ‌సేన ప‌త్రిక స్పష్టం చేసింది.