జగన్‌ సీఎం అయితే ఆర్థిక మంత్రి ఎవరు..?

ఇటీవలే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీ అధినేత జగనే అధికారం చేపడతారని సర్వేల్లో తేలింది. అయితే.. ఇందుకు అనుగుణంగా వైసీపీ శ్రేణులు ఇప్పటికే మేము గెలుస్తాం.. జగనే సీఎం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘చీఫ్ మినిస్టర్ జగన్’ అనే బోర్డులు కూడా తయారు చేయించారు. కాగా.. జగన్ సీఎం అయితే.. మరి కేబినెట్‌లో ఎవరుంటారనే దానిపై తాజాగా చర్చ నడుస్తోంది. కీలకమైన శాఖలు ఎవరికి దక్కనున్నాయన్న విషయంలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. […]

జగన్‌ సీఎం అయితే ఆర్థిక మంత్రి ఎవరు..?

Edited By:

Updated on: May 21, 2019 | 8:06 PM

ఇటీవలే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీ అధినేత జగనే అధికారం చేపడతారని సర్వేల్లో తేలింది. అయితే.. ఇందుకు అనుగుణంగా వైసీపీ శ్రేణులు ఇప్పటికే మేము గెలుస్తాం.. జగనే సీఎం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘చీఫ్ మినిస్టర్ జగన్’ అనే బోర్డులు కూడా తయారు చేయించారు. కాగా.. జగన్ సీఎం అయితే.. మరి కేబినెట్‌లో ఎవరుంటారనే దానిపై తాజాగా చర్చ నడుస్తోంది. కీలకమైన శాఖలు ఎవరికి దక్కనున్నాయన్న విషయంలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇస్తారని, ఒకవేళ ఆయనకు కుదరకపోతే, ఆ పదవికి అంబటి రాంబాబును ఎంపిక చేయవచ్చని అంటున్నారు. స్పీకర్‌గా వీరిద్దరిలో ఎవరున్నా టీడీపీని సమర్ధవంతంగా హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీరితో పాటు తనతో ఆదినుంచి ప్రయాణించిన వారికి మంత్రి పదవులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తదితరులకు పదవులు దక్కవచ్చని సమాచారం.