West Bengal: బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. టీఎంసీలో చేరిపోయిన మరో ఎమ్మెల్యే

|

Aug 31, 2021 | 5:06 PM

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగులింది. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణాముల్ కాంగ్రెస్(TMC) విజయం తర్వాత ఆ పార్టీలోకి బీజేపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి.

West Bengal: బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. టీఎంసీలో చేరిపోయిన మరో ఎమ్మెల్యే
TMC vs BJP
Follow us on

West Bengal – BJP vs TMC: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగులింది. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణాముల్ కాంగ్రెస్(TMC) విజయం తర్వాత ఆ పార్టీలోకి బీజేపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార టీఎంసీ తీర్థంపుచ్చుకున్నారు.  బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కక్కరు ఆ పార్టీని వీడి తృణాముల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం కమలనాథులకు మింగుడుపడటం లేదు. మంగళవారంనాడు మరో ఇద్దరు బీజేపీ నేతలు తృణాముల్ కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోగా.. వీరిలో ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, కౌన్సిలర్ మనతోష్ నాథ్‌లు కోల్‌కత్తాలో జరిగిన కార్యక్రమంలో టీఎంసీ కండువాలు కప్పుకున్నారు.

తృణాముల్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడంతో సొంత ఇంటికి వచ్చినట్లు భావిస్తున్నట్లు ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం తాను పనిచేస్తానని చెప్పారు. కొన్ని అపార్థాల ద్వారా గతంలో పార్టీని వీడి బీజేపీలో చేరినట్లు చెప్పిన దాస్.. అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు.

సోమవారంనాడు భిష్ణుపూర్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి మాసంలో ఆయన టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.

Also Read..

సుప్రీంకోర్టు మరో కీలక తీర్పులు.. ఆ 40 అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేయండి

మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. పేరేమో సూపర్.. సోషల్ మీడియాలో వైరల్!