
వైఎస్ జగన్ పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. నవరత్నాల పథకంలో ప్రతి వర్గానికి లబ్ది చేకూరుతుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. శాసన సభాపక్షనేతగా వైఎస్ జగన్ ఎన్నికవడంపై హర్షం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్ గారి పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పిస్తూ రైతన్నల కష్టాలకు కాలం చెల్లే రోజులు వచ్చాయి. నవరత్నాలతో ప్రతి పేదింటి గడప అభివృద్ధికి ఒక ప్రయోగశాలగా మారబోతోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 25, 2019
వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే శక్తిని మీకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 25, 2019
ఇక కార్యకర్తలనుద్ధేశించి మరో ట్వీట్ చేశారు. ప్రజల దీవెనతో సాధించిన ఈ ఘన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత పెరిగిందన్నారు. ఐదేళ్ల పాలనలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. అందులో నుంచి పుట్టిన కసిని జగనన్నను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలని అన్నారు.
ప్రజల దీవెనతో సాధించిన ఈ ఘన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత పెరిగింది. ఐదేళ్ల నారాసుర పాలనలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందులో నుంచి పుట్టిన కసిని జగనన్నను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలి. మాటకు మాట, ప్రతీకారాలు మనకు, వాళ్లకు తేడా లేకుండా చేస్తాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 25, 2019