K Sasikala : చిన్నమ్మ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. తమిళనాడు రాజకీయాల్లో పెరిగిన పొలిటికల్ హీట్

త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయ‌ల‌లిత నెచ్చెలి.. చిన్నమ్మగా పేరొందిన కే శ‌శిక‌ళ ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుద‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. బెంగ‌ళూరు జైలు అధికారులు తెలిపినట్టు..

K Sasikala : చిన్నమ్మ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. తమిళనాడు రాజకీయాల్లో పెరిగిన పొలిటికల్ హీట్
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 20, 2021 | 5:50 AM

Sasikala : త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయ‌ల‌లిత నెచ్చెలి.. చిన్నమ్మగా పేరొందిన కే శ‌శిక‌ళ ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుద‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. బెంగ‌ళూరు జైలు అధికారులు తెలిపినట్టు.. ఆమె త‌ర‌పు న్యాయ‌వాది రాజా సేథురాపాండియ‌న్ వెళ్లడించారు. 2016లో జ‌య‌ల‌లిత చనిపోయిన త‌ర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన శ‌శిక‌ళ‌.. నాలుగేండ్ల క్రితం అక్రమాస్తుల కేసులో బెంగ‌ళూరులోని జైలు పాల‌య్యారు.

అయితే నాలుగేండ్ల జైలుశిక్ష పూర్తి కావ‌డంతోపాటు విడుదల ఒక్కటే మిగిలివుంది. ఇందు కోసం 10 కోట్ల రూపాయల జ‌రిమానను చెల్లిస్తే శ‌శిక‌ళ విడుద‌లకు రూట్ క్లీయర్ అవుతుంది. త్వర‌లో త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల కానుండ‌టంతో అక్కడి రాజకీయాలు ఇప్పుడు ఆమె చుట్టు తిరుగుతున్నాయి. త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రులు జ‌య‌ల‌లిత, ఎంకే క‌రుణానిధిలు మ‌ర‌ణించ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయ శూన్య‌త కొనసాగుతోంది.

జ‌య‌ల‌లిత హ‌యాంలో అన్నాడీఎంకేలో శ‌క్తిమంత‌మైన వ్యక్తిగా శ‌శిక‌ళ ప్రస్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకావం ఉంది. అయితే, సీఎం ఎడ‌పాడి కే ప‌ళ‌నిస్వామి మాత్రం అన్నాడీఎంకేలోకి శ‌శిక‌ళ‌ను చేర్చుకునేంది లేదని తేల్చి చెప్పారు.

మరో మంగళవారం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులను ఎడప్పాడి కలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇటీవల చెన్నై నగరంలో పర్యటించిన  హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి , ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనితో రెండు పార్టీల మధ్య విబేధాలు నెలకొన్నాయి. సీఎం అభ్యర్థిని కూటమికి నాయకత్వం వహిస్తున్న అన్నాడీఎంకే ప్రకటించిన తర్వాత మిత్రపక్షమైన బీజేపీ సీఎం అభ్యర్థి గురించి ప్రకటించే అధికారం లేదంటూ అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..