పూళ్ల గ్రామంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 28 కి చేరిన వ్యాధిగ్రస్థులు.. స్పందించిన మంత్రి ఆళ్లనాని ఏం చెప్పారంటే..

Strange Disease in West Godavari: ఏలూరులో వందలాది మంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన ఘటన మరవక ముందే పశ్చిమగోదావరి

  • uppula Raju
  • Publish Date - 8:52 am, Wed, 20 January 21
పూళ్ల గ్రామంలో విస్తరిస్తున్న వింత వ్యాధి.. 28 కి చేరిన వ్యాధిగ్రస్థులు.. స్పందించిన మంత్రి ఆళ్లనాని ఏం చెప్పారంటే..

Strange Disease in West Godavari: ఏలూరులో వందలాది మంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన ఘటన మరవక ముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో రెండు రోజులుగా యువకులు, మహిళలు ఉన్నట్టుండి మూర్చవచ్చి పడిపోతున్నారు. వీరి సంఖ్య 28కి చేరింది. రోజు రోజుకు వింత వ్యాధి బాధితులు పెరుగుతూ పోతున్నారు.

అయితే గ్రామంలో పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వింత వ్యాధి వల్ల ప్రాణాపాయం లేదన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వెల్లడించారు. వైద్య బృందాలు వాటర్, ఆహారపదార్థాల శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే వ్యాధికి సంబంధించి కారణాలు తెలుస్తాయని అన్నారు.

పశ్చిమబెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి.. ఘటనకు సంబంధించి కారణాలు..